Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై రేవతిషాశ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడితే లాభాలు అధికంగా ఉంటాయి. కొన్ని రాశుల ఉద్యోగులకు అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఉద్యోగులుకు అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. కార్యాలయాల్లో విధించిన లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి:
చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఓ సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. సోదరుల మద్దతుతో కొన్ని రంగాల వారు అధిక లాభాలు పొందుతారు.
మిథున రాశి:
వ్యాపార అభివృద్ధి కోసం కృషి చేస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి సరైన వైద్యం అందుతుంది. అయినా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఓ సమాచారం ఆందోళనను కలిగిస్తుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి వారు కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. సమయానికి కొన్నిపనులు పూర్తి కావడంత మనసు ఉల్లాసంగా ఉంటుంది.
సింహా రాశి:
వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలపై ప్రయాణాలు చేయాల్సి వస్తే తొందరపాటు చర్యలు వద్దు.పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
కన్యరాశి:
ఉద్యోగులు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో ఒకరికి అనారోగ్యంతో ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబానికి సంబంధించి ఓ సమాచారం ఆందోళనను కలిగిస్తుంది.
తుల రాశి:
కొన్ని శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
వృశ్చిక రాశి:
కొన్ని రంగాల వారికి అనుకోని అదృష్టం కలగనుంది. సమాచారం లోపంతో కొందరితో వాగ్వాదాలు ఉంటాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది.
ధనస్సు రాశి:
ఉద్యోగులు ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. అధిక శ్రమ కారణంగా అనారోగ్యానికి గురవుతారు. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి.
మకర రాశి:
పట్టుదలకు పోకుండా ఉండాలి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. వీరికి జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కొన్ని రంగాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది.
కుంభ రాశి:
ఇంటి నిర్మాణానికి సంబంధించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పై అధికారి వేధింపులతో ఉద్యోగులు మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి కష్టపడుతారు. ఇవి ఫలితాలను ఇస్తాయి.
మీనరాశి:
కుటుంబ సభ్యులో సంతోషంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం. పిల్లల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని ఇస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.