Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: అన్నీ తానై.. అంతా ఒక్కడై జగన్

CM Jagan: అన్నీ తానై.. అంతా ఒక్కడై జగన్

CM Jagan: ఏపీ సీఎం జగన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయనకు ప్రజలు అధికారిమిచ్చారు. ఇప్పుడు అధికారమే ఆయన్ని ప్రజలకు దూరం చేస్తోంది. ప్రజలను పరదాల మాటున కలవాల్సి వస్తోంది. జగన్ లో వచ్చిన ఈ తేడా పార్టీకి, ఆయన భవిష్యత్తుకు చాలా ప్రమాదకరంగా మారుతోంది.

అధికారంలోకి రాకముందు జనం బాట పట్టారు. ఇప్పుడు అదే జనాన్ని వద్దనుకుంటున్నారు. ఇప్పటివరకు తమను పట్టించుకోలేదని పార్టీ నాయకులు ఆవేదనతో గడిపారు. ఎన్నో ఆశలతో,ఆశయాలతో గెలిపిస్తే అవేవీ తీరకపోవడంతో చాలామంది పార్టీకి దూరమవుతున్నారు. అపాయింట్మెంట్ దొరకని చాలామంది నాయకులు పార్టీపై బురదజల్లేందుకు రెడీగా ఉన్నారు. సీఎంని కలవడం కుదరకపోయిన చాలామంది నాయకులు అంతర్గత సమావేశాలు, ప్రైవేట్ సంభాషణల్లో సీఎం జగన్ను ఆడిపోసుకుంటున్నారు.

సీఎం జగన్ ప్రసంగాల్లో సైతం డొల్లతనం కనిపిస్తోంది. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మునుపటి వాడీ వేడీ కనిపించడం లేదు. అటు ప్రజలను నేరుగా కలుసుకునేందుకు ఇష్టపడటం లేదు. మొన్నటికి మొన్న వర్షాలతో నష్టపోయిన రైతుల పరామర్శకు చాలా సమయం తీసుకున్నారు. వర్షాలు తగ్గిన వారం రోజులకు పరామర్శలకు వెళ్లారు. దీంతో ఒక రకమైన అపవాదు ప్రజల్లోకి బలంగా వెళుతుంది.

పార్టీలో సీనియర్ల నుంచి జగన్ కు ఆశించిన సపోర్ట్ దక్కడం లేదు. అటు మంత్రులు సైతం డమ్మీలుగా మారుతున్నారు. సలహాదారులు హోదాలకే పరిమితం అవుతున్నారు. విపక్షనేత చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టారు. జగన్ సర్కార్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో గణాంకాలతో సహా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. కానీ ఆ స్థాయిలో మంత్రులు ప్రతిస్పందించడం లేదు. సంబంధిత మంత్రులు సైతం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. విపక్షాలకు అడ్డుకట్ట వేస్తూ.. ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించడం జగన్ కు కత్తి మీద సాములా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version