https://oktelugu.com/

Surekhavani Daughter Supritha: బిగ్ బాస్ హౌస్లోకి ఆ క్రేజీ తల్లీకూతుళ్లు సురేఖావాణి-సుప్రీత?

సుప్రీత కూడా సెలబ్రిటీనే. ఆమెకు ఇంస్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. తరచుగా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. అమ్మ సురేఖావాణితో కలిసి ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు చేస్తుంది.

Written By: , Updated On : August 8, 2023 / 05:14 PM IST
Surekhavani Daughter Supritha

Surekhavani Daughter Supritha

Follow us on

Surekhavani Daughter Supritha: బిగ్ బాస్ తెలుగు 7కి సర్వం సిద్ధం. కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో షో మొదలు కానుంది. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యింది. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా నటి సురేఖావాణి ఈసారి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. అనూహ్యంగా ఆమె కూతురు సుప్రీత పేరు కూడా తెరపైకి వస్తుంది. తల్లీ కూతుళ్ళ హోదాలో వీరు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారట. ఇప్పటి వరకు భార్యాభర్తలు మాత్రమే హౌస్లో పార్టిసిపేట్ చేశారు. ఈసారి ప్రయోగాత్మకంగా మదర్ డాటర్ ని పంపే యోచనలో ఉన్నారట మేకర్స్.

సుప్రీత కూడా సెలబ్రిటీనే. ఆమెకు ఇంస్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. తరచుగా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. అమ్మ సురేఖావాణితో కలిసి ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు చేస్తుంది. అప్పుడప్పుడు బుల్లితెర మీద కూడా సందడి చేస్తుంది. సురేఖావాణి తన కూతురిని హీరోయిన్ చేయాలనే ఆలోచనలో ఉందట. బిగ్ బాస్ అందుకు మంచి ఫ్లాట్ ఫార్మ్ లో భావిస్తోందట. బిగ్ బాస్ షోతో పాపులారిటీ రాబట్టి… ఆ ఫేమ్ తో హీరోయిన్ గా ఎదగాలనేది సుప్రీత ఆలోచనట.

అందుకే మేకర్స్ కోరినట్లు సురేఖావాణి, సుప్రీత బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేస్తున్నారనేది టాక్. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇటీవల డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు వినిపించింది. డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కేపీ చౌదరితో సురేఖావాణికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో తెలిసింది. మీడియాలో సురేఖావాణి పేరు రాగా ఆమె ఖండించారు. వీడియో బైట్ విడుదల చేశారు.

సుప్రీత సైతం కేపీ చౌదరితో దిగిన ఫోటోలు హల్చల్ చేశాయి. ఇదిలా ఉంటే సురేఖావాణికి ఆఫర్స్ తగ్గాయి. గతంలో మాదిరి ఆమెకు వరుస చిత్రాలు రావడం లేదు. ఆ మధ్య తన అసహనం నేరుగా బయటపెట్టింది. ఎందుకో పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసిందని వాపోయింది. 2019లో సురేఖావాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించాడు. అప్పుడు కొన్నాళ్ళు సురేఖావాణి సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది. అప్పటి నుండి ఆమెకు అవకాశాలు రావడం తగ్గింది.