https://oktelugu.com/

Alia Bhatt: వీడియో: హాలీవుడ్ హీరోయిన్ కి తెలుగు నేర్పిన అలియా భట్! ఆ రెండు వాక్యాలు ఏమిటో తెలుసా?

హాలీవుడ్ కి మనం పోటీ ఇస్తున్నాం. దీంతో తెలుగులో చిత్రాలు చేయాలని ఇతర బాషల హీరోయిన్స్ చూస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ ని తక్కువగా చూసేవారు.

Written By:
  • Shiva
  • , Updated On : August 8, 2023 / 06:32 PM IST

    Alia Bhatt

    Follow us on

    Alia Bhatt: హీరోయిన్ అలియా భట్ హాలీవుడ్ హీరోయిన్ కి తెలుగు నేర్పడం ఆసక్తికరంగా మారింది. తెలుగు భాషా, టాలీవుడ్ చిత్రాలు ఇతర పరిశ్రమల మీద ఎంతటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్పేందుకు ఇది నిదర్శనం. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తమైంది. ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ గెలుచుకోగా తెలుగు అనే ఒక భాష ఉంది. అదో పెద్ద సినిమా పరిశ్రమ అనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే టాలీవుడ్ నెంబర్ వన్ పరిశ్రమగా ఎదిగిందంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల బడ్జెట్ కలుపుకుంటే రూ. 3000 కోట్లకు పైనే ఉంటుంది. ఒక్క ప్రభాస్ చేసే చిత్రాల బడ్జెట్స్ వెయ్యి కోట్లను దాటేశాయి.

    హాలీవుడ్ కి మనం పోటీ ఇస్తున్నాం. దీంతో తెలుగులో చిత్రాలు చేయాలని ఇతర బాషల హీరోయిన్స్ చూస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ ని తక్కువగా చూసేవారు. మన చిత్రాల్లో నటించడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. అందుకే చాలా మంది స్టార్ హీరోయిన్స్ కనీసం ఒక్క తెలుగు సినిమా చేయకుండానే ఫేడ్ అవుట్ అయ్యారు. అలాంటిది హిందీ హీరోయిన్ నోటి వెంట తెలుగు వాక్యాలు రావడం… అది కూడా అంతర్జాతీయ సినిమా ప్రమోషన్స్ లో జరగడం విశేషంగా మారింది.

    వండర్ ఉమెన్ మూవీతో వరల్డ్ వైడ్ అభిమానులను సొంతం చేసుకుంది గాల్ గాడోట్. ఆమె లేటెస్ట్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ స్టోన్. ఈ యాక్షన్ సిరీస్ ఆగస్టు 11 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. హార్ట్ ఆఫ్ స్టోన్ ప్రాజెక్ట్ ద్వారా అలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. గాల్ గాడోట్ లీడ్ రోల్ చేస్తుండగా అలియా భట్ కీలక పాత్రలో మెప్పించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో అలియా, గాల్ గాడోట్ కలిసి పాల్గొంటున్నారు.

    ఈ సందర్భంగా రెండు తెలుగు వ్యాక్యాలు అలియా భట్ గాల్ గాడోట్ కి నేర్పింది. ‘అందరికీ నమస్కారం, మీకు నా ముద్దులు’ అనే వాక్యాలు అలియా భట్ చెబుతుంటే గాల్ గాడోట్ అనుకరించే ప్రయత్నం చేసింది. కొంత వరకు ఆమె ఈ రెండు తెలుగు వాక్యాలు చెప్పగలిగింది. నిజానికి అలియా భట్ కి కూడా తెలుగు రాదు. తనకు తెలిసిన ఆ రెండు వాక్యాలు గాల్ గాడోట్ తో చెప్పించింది. ఇక అలియా భట్ డెబ్యూ హాలీవుడ్ మూవీపై ఇండియాలో ఆసక్తి నెలకొంది.

    https://twitter.com/DinuRoyalC/status/1688802628048994304