Theni Nurse Murder Case: ఒకరో ఇద్దరితోనే లేక పది మందితోనో సంబంధాలుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఆమె ఏకంగా 150 మందితో సంబంధాలు కొనసాగించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఆమెతో టచ్ లో ఉన్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఏకంగా ఒక దశలో 300 మంది దాకా ఉన్నట్లు విచారణలో తెలుస్తోంది. దీంతో ఒక మహిళ ఇంత మందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మామూలు విషయం కాదు. మరోవైపు ఆమె గదిలో 500 నిరోధ్ కండోమ్స్ లభించడం విశేషం.

తేనీ జిల్లా అండిపట్టి సమీపంలోని పప్పమ్మలేపురానికి చెందిన సురేష్ దిండిగుల్ క్యాటరర్ గా పనిచేసేవాడు. అతడి భార్య సెల్వి (43) అండిపట్టి ప్రభుత్వాస్పత్రిలో సీనియర్ నర్సుగా పనిచేసేది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. సుమారు 17 సంవత్సరాలు నర్సుగా పనిచేసే సెల్వికి భర్తకు అభిప్రాయ భేదాలు రావడంతో పిల్లలతో కలిసి సురేష్ నివాసం ఉంటున్నాడు. సెల్వి మాత్రం ఒంటరిగా ఓ రూం తీసుకుని ఒంటరిగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో ఆమెకు వివాహేతర సంబంధాలు పెరిగాయి. దీంతో ఆమె నవంబర్ 24న హత్యకు గురైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఆమె గదిలో దాదాపు 500 నిరోధ్ కండోమ్స్ దొరకడంతో అవాక్కయ్యారు. ఇన్ని నిరోధ్ లు దొరకడమేమిటని ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. ఆమెకు వివాహేతర సంబంధాలు ఎక్కువే అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
ఆమె వల్ల చాలా కాపురాలు కూలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. అందులో పోలీసులు, డాక్టర్లు, ఆటోడ్రైవర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదే ఆస్పత్రిలో పనిచేసే రామచంద్రప్రభు (34) అనే వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధంపై పోలీసులకు అనుమానం వచ్చింది దీంతో అతడిని విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు చెప్పడంతో అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడిపైనే పోలీసులు పడుతున్న అనుమానం నిజం అయింది.
Also Read: Love Marriage: ప్రేమ పెళ్లి.. నడిబజారులో వధూవరులపై కన్న తండ్రే లొల్లి
ఆమెను అతడే హత్య చేశాడని రుజువైంది. కానీ అతడు ఆత్మహత్య చేసుకోవడంతో అతడే నిందితుడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామచంద్రప్రభు దగ్గర సెల్వి అప్పు చేసిందని ఆ డబ్బుల విషయంలోనే గొడవ జరిగి హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన మరునాడు ఓ బంగారు గొలుసు నిందితుడు తాకట్టు పెట్టినట్లు తెలిసింది. హత్య జరిగిన రోజు పుటేజీని పరిశీలించగా నిందితుడు ఆమె గదిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Omicron: ఒమిక్రాన్ వేరియంట్‌లో HIV వైరస్ మూలాలు.. దక్షిణాఫ్రికా సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!