Homeఎంటర్టైన్మెంట్Sree Vishnu: యంగ్ హీరో శ్రీ విష్ణు "భళా తందనాన" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్...

Sree Vishnu: యంగ్ హీరో శ్రీ విష్ణు “భళా తందనాన” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…

Sree Vishnu: విలక్షణ కథలతో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. వైవిధ్యభరిత పాత్రలలో నటిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీవిష్ణు. ఇటీవల కాలంలో పలు సినిమాలతో మంచి సక్సెస్ అందుకొని ఈ యంగ్ హీరో ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. ఆయన నటించిన బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర చిత్రాలు మంచి హిట్ సాధించడంతో శ్రీ విష్ణు తదుపరి మూవీ లపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో ‘భళా తందనాన’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో న‌టిస్తున్నారు. బాణం మూవీ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్‌గా మూవీ షూటింగ్ పూర్త‌య్యింది.

hero sree vishnu new movie bhala thandnana first look poster released

ఇక‌ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ‘భళా తందనాన` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇన్ సైడ్ వైట్ టీ షర్ట్ ధరించి డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్‌తో ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న శ్రీ విష్ణు లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. చేతిలో రెండు తుపాకులు పట్టుకొని ఎంతో కోపంగా కనిపిస్తున్న శ్రీ విష్ణు చుట్టూ రౌడీ గ్యాంగ్ కనిపిస్తుండటం ఈ కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉండనుందో చెబుతోంది. భళా తందనాన చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే ఉండదని తెలుస్తోంది. ఇక ప్రతినాయకుడిగా కేజిఎఫ్ ఫేమ్ రామచంద్ర రాజు రోల్ మరింత పవర్ ఫుల్‌గా ఉండనుంది. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ బాణీలు కడుతుండగా.. సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular