https://oktelugu.com/

చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిక్కలోడు.. మన పవన్ కళ్యాణ్ లాగానే ‘నాక్కొంచం తిక్కుంది.. దానికి లెక్కలేదు’ అంటూ కరోనా వేళ అన్నింటిని వదిలేశాడు. ప్రాణాలంకటే తనకు అమెరికా ఆర్థిక వ్యవస్థనే ముఖ్యమని లాక్ డౌన్ విధించలేకపోయాడు. దీంతో కరోనా వైరస్ తో అమెరికా అల్లకల్లోలం అయిపోయి లక్షలమంది ప్రాణాలు పోయాయి. Also Read: కేసీఆర్ తో కయ్యానికి సిద్ధమవుతున్న జగన్? అయితే దేశప్రజలను కరోనాకు ఫణంగా పెట్టిన ట్రంప్.. మొండిపట్టుదలకు పోయి ఇప్పుడు ఆ దేశ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2020 / 07:23 PM IST
    Follow us on


    ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిక్కలోడు.. మన పవన్ కళ్యాణ్ లాగానే ‘నాక్కొంచం తిక్కుంది.. దానికి లెక్కలేదు’ అంటూ కరోనా వేళ అన్నింటిని వదిలేశాడు. ప్రాణాలంకటే తనకు అమెరికా ఆర్థిక వ్యవస్థనే ముఖ్యమని లాక్ డౌన్ విధించలేకపోయాడు. దీంతో కరోనా వైరస్ తో అమెరికా అల్లకల్లోలం అయిపోయి లక్షలమంది ప్రాణాలు పోయాయి.

    Also Read: కేసీఆర్ తో కయ్యానికి సిద్ధమవుతున్న జగన్?

    అయితే దేశప్రజలను కరోనాకు ఫణంగా పెట్టిన ట్రంప్.. మొండిపట్టుదలకు పోయి ఇప్పుడు ఆ దేశ చిన్నారులను బలిగొంటున్నాడు. జూలై నెల మధ్యలో అమెరికాలో స్కూళ్లు, యూనివర్సిటీలను రీఓపెన్ చేసిన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు. స్కూల్లు ఓపెన్ చేయగానే విద్యార్థులు పాఠశాలలకు వచ్చారు. ఇప్పుడు మూడు వారాలు గడిచేసరికి దాదాపు 97,000మంది అమెరికా పిల్లలకు కరోనా పాజిటివ్ గా తేలింది.

    జూలై 16 నుండి 30 వరకు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి తీసుకున్న గణాంకాల ప్రకారం.. దేశంలో ఐదు మిలియన్ల కేసులలో అగ్రస్థానంలో ఉంది. వీటిలో 338,000 మంది పిల్లలకు వైరస్ సోకడం దిగ్భాంతి కలిగిస్తోంది. 162,000 మంది మరణించారు.

    అమెరికాలో స్కూల్లు తెరిస్తే ఎంతటి విధ్వంసం నెలకొన్నదో చూశాం. ఇప్పుడు అంతుకుమించి జనాభా గల భారతదేశంలో గనుక స్కూళ్లు ఓపెన్ చేస్తే వినాశనమే అనడంలో ఎలాంటి సందేహం లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Also Read: తెలంగాణ పీసీసీ ఛీఫ్ కోసం కర్ణాటకలో రాజకీయాలు?

    అగ్రరాజ్యం అమెరికాతో పోలిస్తే మన దేశంలో స్కూలు, ఆసుపత్రుల్లో మౌళిక వసతులు, భద్రతా చర్యలు చాలా దారుణంగా ఉంటాయి. కుప్పలు తెప్పలుగా చిన్నారులను గదుల్లో కుక్కుతారు. దీంతో కరోనా వైరస్ ఒక్కరికున్నా అది అందరికీ సోకుతుంది. అసలే పిల్లల ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. వారికి సోకితే ఇక కంట్రోల్ చేయడం ప్రభుత్వాలకు కూడా చేతకాదు.. మనదగ్గర ఆసుపత్రుల్లో అన్ని బెడ్స్ కూడా లేవు. దీంతో రోడ్లమీదనే చిన్నారులు పడిపోయే దృశ్యాలు కనిపించవచ్చు.

    ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి స్కూలు తెరవడానికి రెడీ అవుతోంది. కేంద్రం కూడా సెప్టెంబర్ నుంచే ఆలోచిస్తోంది. మరి అమెరికాలో స్కూల్లు తెరిచాక జరిగిన వినాశనం చూశాకైనా మన దేశ ప్రభుత్వాలు కళ్లు తెరిస్తే చాలని విద్యావేత్తలు హితవు పలుకుతున్నారు.

    -ఎన్నం