తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ఇక అతనే సీఎం..?

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు.. కేటీఆర్ పట్టాభిషేకానికి రంగం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. పాలనా వ్యవహారాలు అన్నీ అతని కొడుకు కేటీఆర్ చూసుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్ కరోనా విషయమై అప్డేట్లు, విమర్శలకు సమాధానాలు ఇస్తూ పర్యటిస్తున్నారు.. కీలక స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.. తాజాగా ఒక డమ్మీ భేటీ కూడా నిర్వహించి తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు […]

Written By: Navya, Updated On : August 13, 2020 7:30 pm
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు.. కేటీఆర్ పట్టాభిషేకానికి రంగం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. పాలనా వ్యవహారాలు అన్నీ అతని కొడుకు కేటీఆర్ చూసుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్ కరోనా విషయమై అప్డేట్లు, విమర్శలకు సమాధానాలు ఇస్తూ పర్యటిస్తున్నారు.. కీలక స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.. తాజాగా ఒక డమ్మీ భేటీ కూడా నిర్వహించి తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అన్న సంకేతాలను పంపేశారు.

కేంద్రంలో క్రియాశీలక రాజకీయాలు చేసేందుకు కేసీఆర్ ఇదే సరైన సమయం అని భావిస్తుండడంతో ఎప్పటినుండో కేటీఆర్ పగ్గాలు చేపడతారని అందరూ చెబుతున్నారు. అయితే కరోనా సంక్షోభం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైనా…. ఇక ఇప్పుడు మాత్రం కేటీఆర్ టైం మొదలవబోతోంది అన్న సంకేతాలు పంపించేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కొత్త సెక్రటేరియట్ అన్ని హంగులతో.. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా సిద్ధమవుతోంది. ఆరు నెలలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కొత్త సెక్రటేరియట్ లో కేటీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట చాలా బలంగా వినిపిస్తోంది.

కేసీఆర్ ఈ ఆరు నెలలు లోపల ఎప్పుడైనా తన పదవి నుండి వైదొలగి కేటీఆర్ కు బాధ్యతలు ఇవ్వచ్చు అని ప్రజలు, టిఆర్ఎస్ కేడర్ మానసికంగా సిద్ధం అయిపోయారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే తన కొడుక్కి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తానని కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. ప్లీనరీలో తీర్మానం చేయబోతున్నానని కూడా చెప్పుకొచ్చారు. ఇక జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ అంశం తీసుకొచ్చిన కెసిఆర్…. ముందు నుంచి ఈ విషయమై సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కేటీఆర్ మరింత కీలకమైన బాధ్యతలు చేపట్టడం ఖాయమని అభిప్రాయం రాష్ట్రమంతా ఏర్పడడం మొదలైపోయింది.