https://oktelugu.com/

Rupee Value: మన రూపాయి విలువ.. ఈ దేశాల్లో అమెరికన్ డాలర్ కు మించి..

హనీ మూన్ వెళ్లడానికి కొత్త జంటలకు ఇది సరైన గమ్యస్థానం..బాలి, జకర్తా, ఉబుద్, బాతం, బోరో బుదూర్ టెంపుల్, నుసా లెంబొంగన్ వంటి అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

Written By:
  • Rocky
  • , Updated On : September 11, 2023 / 06:44 PM IST

    Rupee Value

    Follow us on

    Rupee Value: అమెరికా డాలర్ విలువ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇండియా రూపాయి విలువ జీవితకాల కనిష్ఠాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇదే క్రమంలో ఫెడరల్ మార్కెట్ వడ్డీ రేట్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటే.. రూపాయి పరిస్థితి ఏమిటి అనేది అంతు పట్టకుండా ఉంది. ఈ నేపథ్యంలో భారత కరెన్సీ విలువ ఇంతేనా? ఇక మారదా? అయితే కొన్ని దేశాలలో రూపాయి విలువ చాలా రెట్లు పెరుగుతోంది. ఆ దేశాల్లో మన కరెన్సీ తో చౌకగా పర్యటించవచ్చు.. అలాంటి దేశాలు ఏవో ఒకసారి చూద్దాం.

    ఇండోనేషియా

    హనీ మూన్ వెళ్లడానికి కొత్త జంటలకు ఇది సరైన గమ్యస్థానం..బాలి, జకర్తా, ఉబుద్, బాతం, బోరో బుదూర్ టెంపుల్, నుసా లెంబొంగన్ వంటి అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ దేశంలో ఒక భారతీయ రూపాయి విలువ 184. 12 ఇండోనేషియా రూపాయలు.

    వియత్నాం

    ఈ దేశం కూడా పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉంటాయి. వంకరగా ఉండే కొండ కోనలు, ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తాయి..హలోంగ్ బే, హనోయి, హా గియాంగ్, సాపా వంటి ప్రాంతాలు ప్రసిద్ధి పొందాయి. వియత్నాంలో భారతీయ రూపాయి విలువ 289.54 వియత్నామీస్ డాంగ్ కు సమానం.

    కంబోడియా

    కంబోడియా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆకర్షనీయమైన పర్యాటక ప్రాంతం. అంగ్ కోర్ వాట్ టెంపుల్, కో రాంగ్ వంటి ప్రదేశాలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఒక భారతీయ రూపాయి విలువ 50.05 కంబోడియాన్ రియాల్.

    శ్రీలంక

    సాహసోపేతమైన పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గధామం. ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.. నైన్ ఆర్చ్ బ్రిడ్జి, మింటెల్, గల్ విహార్, రావణ జలపాతం వంటివి అనేక ప్రసిద్ధ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క భారతీయ రూపాయి విలువ 3.89 శ్రీలంక రూపాయలకు సమానం.