https://oktelugu.com/

Priyanka Chopra: పెళ్ళైన స్టార్ హీరోతో డేటింగ్… తర్వాత చాలా బాధపడ్డానంటూ ప్రియాంక బోల్డ్ కామెంట్స్!

డాన్ 2, డాన్ 3 చిత్రాల్లో ప్రియాంక-షారుక్ జతకట్టారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘాడమైన ప్రేమ బంధం ఏర్పడినట్లు పుకార్లు వినిపించాయి. కాబట్టి ప్రియాంక చెప్పిన స్టార్ హీరో షారుక్ ఖాన్ అంటున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : September 11, 2023 / 06:48 PM IST

    Priyanka Chopra

    Follow us on

    Priyanka Chopra: పెళ్లయ్యాక పాత ప్రేమకథలు, ఎఫైర్స్ ని ఎవరూ తెరపైకి తేవాలనుకోరు. దాని వల్ల భర్తతో మనస్పర్థలు తలెత్తే ప్రమాదం ఉందని భయపడతారు. ప్రియాంక చోప్రా మాత్రం… ఒక దశలో లెక్కకు మించిన ఎఫైర్స్ నడిపానని ఓపెన్ గా చెబుతుంది. బాలీవుడ్ లో నేను బ్రేక్ లేకుండా డేటింగ్ చేశానని ఆమె చెప్పడం విశేషం. ఒకరి తర్వాత మరొకరితో, కో స్టార్స్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులతో డేటింగ్ చేశానని ఓ అమెరికన్ షోలో ప్రియాంక చోప్రా ఓపెన్ గా చెప్పింది.

    అయితే పెళ్ళికి ముందు ఓ స్టార్ హీరోతో ఎఫైర్ మాత్రం తనను బాధించిందట. ఆ హీరోతో నా వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. బ్రేకప్ అయ్యాక రెండేళ్లు ఒంటరిగా ఉన్నాను. ఆ సమయంలో ఒకింత మానసిక వేదన అనుభవించాను. అతనితో రిలేషన్ పెట్టుకోకుండా ఉండాల్సిందని బాధపడ్డాను… అని ప్రియాంక చోప్రా చెప్పింది. ఆ హీరో ఎవరనేది ఆమె వెల్లడించలేదు. ప్రియాంక కామెంట్స్ పరిశీలిస్తే అది షారుక్ ఖాన్.

    డాన్ 2, డాన్ 3 చిత్రాల్లో ప్రియాంక-షారుక్ జతకట్టారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘాడమైన ప్రేమ బంధం ఏర్పడినట్లు పుకార్లు వినిపించాయి. కాబట్టి ప్రియాంక చెప్పిన స్టార్ హీరో షారుక్ ఖాన్ అంటున్నారు. ప్రస్తుతం హాలీవుడ్ కి పరిమితమైన ప్రియాంక చోప్రా… 2018లో అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి. సరోగసి పద్దతిలో తల్లి అయ్యింది.

    నా గత అఫైర్స్ గురించి నిక్ జోనాస్ కి తెలుసని ప్రియాంక చోప్రా అన్నారు. అలాగే నిక్ తన అఫైర్స్ నాతో చెప్పాడని ప్రియాంక చెప్పడం విశేషం. భర్త నిక్ కంటే ప్రియాంక చోప్రా వయసులో 10 ఏళ్ళు పెద్దది. ఈ విషయంలో ఆమె ట్రోల్స్ కి గురయ్యారు. ఇక బాలీవుడ్ లో ఓ వర్గం నన్ను టార్గెట్ చేసింది. అందుకే హిందీ చిత్ర పరిశ్రమను వీడాల్సి వచ్చిందని ప్రియాంక చోప్రా చెప్పడం విశేషం.