AP Debts: ఏపీ ప్రభుత్వ అప్పులపై ఫుల్ క్లారిటీ వచ్చింది. గత నాలుగేళ్లుగా జగన్ సర్కార్ చేసిన అప్పుల వివరాలను కేంద్రం వెల్లడించింది. బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాల అప్పులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల వివరాలను పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు రికార్డ్ సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయానికి వస్తే 2023 మార్చి వరకు బడ్జెట్ అంచనాలను బట్టి.. రూ.4,42,442కోట్ల అప్పులు ఉన్నట్లు నిర్ధారించారు. దీనికి కార్పొరేషన్ వారిగా తీసుకున్న రుణం అదనం. 2019 మార్చినాటికి ఏపీ రుణం అక్షరాల.. రూ.2,64,451 ఉంటే ఇప్పుడది రూ.4,42,442 అయ్యింది.
అప్పుల్లో తమిళనాడు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రం అప్పు రూ.7.54 లక్షల కోట్లు. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. ఏపీ ఏడో స్థానంలో నిలవడం విశేషం.
ఏపీని అప్పులు కుప్పగా మార్చేసారని వైసీపీ సర్కార్ పై ఒక అపవాదు ఉంది. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన వైసీపీకి ఉపశమనం కలిగించే విషయం. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది. ఏపీ సర్కార్ నేరుగా కాకుండా వివిధ కోపరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు లెక్కల్లో రాలేదు. వాటిని పరిగణలో తీసుకుంటే ఏపీ అప్పుల్లో పరుగు పెడుతుంది. అందుకే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను కూడా పరిగణలో తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The union finance ministry has released a list of how much debt each state in india has
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com