Chiranjeevi Surgery: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకం. ఆయన సినిమాల కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కోట్ల కొద్దీ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన వరుసబెట్టి సినిమాలు తీస్తున్నారు. 60 ఏళ్లు దాటినా మెగాస్టార్ నేటి కుర్రాళ్లకు పోటీనిస్తున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో ఆయన నటించిన ‘భోళా శంకర్’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లు ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల చిరు ఫ్లైట్ లో తన సతీమణి సురేఖతో కనిపించిన విషయం తెలిసిందే. ఆయన అమెరికా వెళ్తుండగా తీసుకున్న ఫొటో అది. అయితే చిరంజీవి వెకేషన్ కోసం ఫారిన్ వెళ్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది.
మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో కొనసాగుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. నిత్యం ఆయనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో అప్డేట్ అవుతూ ఉంటాయి. కానీ ఓ విషయం మాత్రం సీక్రెట్ గా ఉంది. కానీ చాలా రోజుల తరువాత అది బయటకు వచ్చింది. అదేంటంటే చిరంజీవి ఎన్నో రోజుల నుంచి మొకాలు నొప్పితో బాధపడుతున్నాడు. కానీ ఇన్నాళ్లు చిన్న చిన్న చికిత్స తీసుకున్నాడు. కానీ ఇప్పుడు సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సర్జరీని అమెరికాలో చేయించాలని అనుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఆయన సతీమణితో కలిసి అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఎక్కడా బయటకు రాకుండా చూశారు. కానీ ఎలాగోలా బయటకు రావడంతో వైరల్ అవుతోంది. అయితే ఇన్నాళ్లు చిర మొకాలుతో బాధపడే విషయం ఎవరికీ చెప్పకుండా చిరు యాక్టివ్ గా కనిపించారు. అంతేకాకుండా ఆయన గత సినిమా ‘వాల్తేరు వీరయ్య’లో యంగ్ హీరో రవితేజతో సమానంగా డ్యాన్స్ కూడా చేశారు. కానీ ఎక్కడా తనకు మొకాలు నొప్పి ఉన్నట్లు కనిపించలేదు. కానీ ఒక్కసారిగా ఈ విషయం బయటపడడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అంతేకాకుండా చిరు కమిట్మెంట్ తో సినిమాలు చేయడం వల్లే ఈ విషయాన్ని దాచాడని, ముందే చెబితే ఆందోళన చెందుతారని చెప్పలేదు. అయినా ఇప్పుడు చిరు మొకాలుకు జరిగింది చిన్న సర్జరేనని తెలుస్తోంది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కానీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. శరీరంలో ఇంత బాధ పెట్టుకొని పైకి హ్యాపీగా కనిపించే మెగాస్టార్ చిరంజీవి నిజంగా రియల్ హీరో.. అని కొనియాడుతున్నారు.