Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి మూడో విడత యాత్ర షెడ్యూల్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. విశాఖ జిల్లాలో యాత్ర ప్రారంభం కానుంది. జనసేన నాయకత్వం ఈ మేరకు నిర్ణయించింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ విశాఖ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మూడో విడత యాత్ర జరిగేది విశాఖ జిల్లాలో అని క్లారిటీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో తేదీల్లో ఫిక్స్ చేసే అవకాశం ఉంది. దీంతో విశాఖ జనసైనికులలో జోష్ నెలకొంది.
వారాహి తొలి రెండు విడత యాత్రలు ఉభయగోదావరి జిల్లాల్లో చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.దాదాపు 32 నియోజకవర్గాల్లో సుదీర్ఘకాలం పవన్ వారాహి యాత్ర చేపట్టారు.ఉభయగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేశారు. దీంతో జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగింది. పవన్ రాజకీయ ప్రకంపనలకు తెర లేపారు. వైసీపీ సర్కార్కు వణికించారు.
అయితే పవన్ తనకు పట్టున్న ప్రాంతాల్లో వారాహి యాత్ర చేపడుతుండడం విశేషం. తూర్పుగోదావరి జిల్లాల తర్వాత జనసేనకు గట్టి పట్టు ఉన్న ప్రాంతం విశాఖ. అందుకే గత ఎన్నికల్లో పవన్ గాజువాక నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో కీలక నియోజకవర్గాల పై ఫోకస్ పెంచింది. ఈ తరుణంలో పవన్ విశాఖ జిల్లాలో వారాహి యాత్ర చేపడుతుండడం రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.
ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు జనసేన గూటికి చేరారు. ఇంకా చాలామంది నాయకులు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు పవన్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనేది.. ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. వారాహి యాత్ర ద్వారానైనా స్పష్టత ఇస్తారని జన సైనికులు అంచనా వేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వారాహి మూడో విడత యాత్ర షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యాత్ర సన్నాహక సమావేశంలో విశాఖ జిల్లాకు చెందిన నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యాత్ర విజయం వంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.