https://oktelugu.com/

దుబ్బాకలో కాంగ్రెస్‌ గెలుపు ఫై ఉత్తమ్‌కు పరీక్ష. !

ఏదేని ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే దానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. పార్టీ వైఫల్యానికి కారణంగా భావిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ ఇటీవల హుజూర్‌‌నగర్‌‌లో ఓటమి తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని ఉత్తమ్‌ నిర్ణయించుకున్నారు. ఆయన హయాంలో కాంగ్రెస్‌కు లభించిన విజయాలేం లేవు. అందుకే.. హైకమాండ్ కూడా కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేసుకునే ప్రక్రియ పూర్తి చేసింది. కానీ.. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2020 / 12:58 PM IST
    Follow us on


    ఏదేని ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే దానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. పార్టీ వైఫల్యానికి కారణంగా భావిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ ఇటీవల హుజూర్‌‌నగర్‌‌లో ఓటమి తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని ఉత్తమ్‌ నిర్ణయించుకున్నారు. ఆయన హయాంలో కాంగ్రెస్‌కు లభించిన విజయాలేం లేవు. అందుకే.. హైకమాండ్ కూడా కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేసుకునే ప్రక్రియ పూర్తి చేసింది.

    కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆది నుంచీ గ్రూపుల గోల ఉంది. ఎవరికి యమునా తీరే అన్నట్లుగా నడుచుకుంటుంటారు. సీనియర్లు ఒకవైపు.. జూనియర్లు మరోవైపు అంటూ విభేదాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే.. ఉత్తమ్‌ను తప్పించే క్రమంలో కూడా కాంగ్రెస్‌ అధిష్టానానికి ఈ గ్రూపులే అడ్డంకిగా మారాయి. దీంతో ఆ ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉత్తమ్‌ను మారిస్తే అసంతృప్తులను లాక్కునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కాచుకు కూర్చున్నాయి. దీంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ వెనుకాముందు ఆలోచిస్తోంది. ఇదే టైంలో ఉత్తమ్‌కు మరో గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కింది.

    అదే దుబ్బాక ఉపఎన్నిక. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కానీ సత్తా చాటి గెలిస్తే ఇక కొన్ని రోజుల పాటు ఉత్తమ్‌ పోస్టుకు ఢోకా ఉండదనే చెప్పొచ్చు. దీనికితోడు ఉత్తమ్‌ అనుచరులుగా పేరొందిన కొంత మంది నేతలు కూడా పీసీసీ అధ్యక్షుడిని ఇప్పుడే మార్చవద్దని.. దుబ్బాక ఎన్నికలు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయే వరకూ కొనసాగించాలని కోరుతున్నారు. అంతకుముందు జగ్గారెడ్డి లాంటి నేతలు ఉత్తమ్‌నే పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని లేకపోతే.. తనకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌ను పెట్టారు.

    ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికను ఉత్తమ్‌ సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్వయంగా దుబ్బాక మండలానికి తానే బాధ్యుడిగా ప్రకటించుకున్నారు. తనకు సన్నిహితులైన ఇతర నేతలకు ఇతర మండలాల బాధ్యతలు ఇచ్చారు. అభ్యర్థిని కూడా ఎంపిక చేశారు. నర్సారెడ్డిని అభ్యర్థిగా నిర్ణయిస్తూ పేరును హైకమాండ్‌కు పంపారు. ఒక్క పేరే పంపారు కాబట్టి ఖారరయ్యే అవకాశం ఉంది. ఇతర ముఖ్య నేతలు ఈ ఎన్నికల్లో యాక్టివ్‌గా ప్రచారంలో పాల్గొన్నా వ్యూహాలు.. ఇతర వ్యవహారాల్ని మొత్తం ఉత్తమ్‌కే వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఓ రకంగా దుబ్బాక ఉప ఎన్నిక భారం మోతాన్ని ఉత్తమ్‌ ఒక్కడే తన భుజాలపై వేసుకున్నాడు. మరి ఇక్కడ గెలిస్తే ఉత్తమ్‌ దశ తిరుగుతుంది. ఓడిపోతే మాత్రం కొత్త పీసీసీ చీఫ్‌కు బాధ్యతలు అప్పగించక తప్పదని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.