Former CJI NV Ramana: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలుగు వాడైన జస్టిస్ ఎన్వీ రమణ తన రిటైర్మెంట్ కు ముందు చేసిన నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది. వారం రోజుల్లో ఉద్యోగ విరమణ చేసే ముందు చేసిన నియామకం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. దీంతో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న ఎన్వీ రమణ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం గమనార్హం. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న సూర్యదేవర ప్రసన్న కుమార్ ను డిప్యూటేషన్ పై వచ్చినా సుప్రీంకోర్టు శాశ్వత ఉద్యోగిగా నియమిస్తూ రమణ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. ఒక ఉద్యోగి డిప్యూటీషన్ పై వస్తే అతడిని పర్మినెంట్ ఉద్యోగిగా గుర్తించలేమని సూచించింది.

అతడు ఎన్నాళ్లు పనిచేసినా డిప్యూటేషన్ మీదే ఉండాలి కానీ శాశ్వత ఉద్యోగిని చేయడం తగదు. ఇది రూల్స్ కు విరుద్ధమని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో ప్రసన్న కుమార్ ఇప్పటికే తన మాతృసంస్థ ఆలిండియా రేడియోలోకి వెళ్లినట్లు సమాచారం. ప్రసార భారతిలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేసిన ప్రసన్నకుమార్ సుప్రీంకోర్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డిప్యూటేషన్ పై వచ్చారు. ఆయనకు అడిషనల్ రిజిస్ట్రార్ హోదా కల్పిస్తూ మీడియా కన్సల్టెంట్ వ్యవహారాలను అప్పగించారు. ఎన్వీ రమణ సీజేఐా 2021లో నియమించబడిన కొన్నాళ్లకే ప్రసన్న కుమార్ డిప్యూటేషన్ మీద వచ్చారు.
వారం రోజుల్లో రిటైర్మెంట్ అవుతారనే సమయంలో ప్రసన్న కుమార్ నియామకాన్ని పర్మినెంట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం చెల్లదంటూ చెబుతున్నారు. దీంతో సీజేఐ లలిత్ ఈ నియామకం చట్టబద్ధం కాదంటూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగించింది. సుప్రీంకోర్టుకు చాలా మంది వస్తుంటారు పోతుంటారు. వారందరిని పర్మినెంట్ చేస్తే అది సరైన చర్య కాదని అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రసన్న కుమార్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జ్యుడిషియల్ సిస్టమ్ లో పని చేసే వారిని డిప్యూటేషన్ మీద సుప్రీంకోర్టుకు వస్తారు. అకౌంట్స్, ఐటీ వ్యవహారాలు చూడటానికి ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి ఉద్యోగులు రావడం కామనే. కానీ వారిని పర్మినెంట్ చేయడమే తగదు.

దీంతో ప్రసన్నకుమార్ వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదం రేపుతోంది. ప్రసన్న కుమార్ 23 సర్వీసెస్ లో 11 ఏళ్ల లెజిస్లేటివ్ అనుభవం ఉందని పార్లమెంట్ లో కూడా ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. అప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదరడంతో ప్రసారభారతి ఆయనను వెనక్కి రప్పించింది. మొత్తానికి ప్రసన్న కుమార్ మాతృసంస్థకు వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. కానీ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన నియామకం చెల్లదంటూ ప్రస్తుత సీజేఐ ఉత్తర్వులు జారీ చేయడమే గమనార్హం.
Also Read:KCR- Telangana Palapitta: తెలంగాణ పాలపిట్టతో పెద్ద చిక్కుల్లో పడ్డ కేసీఆర్!!