Jagan Speech: రాజకీయాల్లో రాణించాలంటే ఒక్క వ్యూహమే సరిపోదు. నాయకుడి వాగ్ధాటి, సమస్యలు ప్రస్తావించే తీరు, వాటి మూలాలపై వ్యాఖ్యానించడం, ఎదుటి పక్షంపై సహేతుకమైన విమర్శనాస్త్రాలు వంటివి ఉంటేనే ప్రజలు గుర్తిస్తారు. లేకుంటే కష్టమే. వ్యూహాలు మాత్రం అన్నివేళలా పనిచేయవు. చాలామంది నాయకులు వ్యూహాలు పన్ని చేతులు కాల్చుకున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ ఏం చేసినా అది వైసీపీ శ్రేణులకు వ్యూహంలా కనిపిస్తుంటుంది. అంతులేని విజయాలు సొంతమైనప్పుడు అలానే కనిపిస్తుంది. కానీ ఏదో రోజు మాత్రం అది వికటించే ప్రమాదముంది. ఇటీవల ఆయన ఒక ప్రకటన చేశారు. హుద్ హుద్ తుపాను సమయంలో తాను అహోరాత్రులు శ్రమించానని.. 11 రోజుల పాటు విశాఖలో ఉండిపోయానని చెప్పుకొచ్చారు. కానీ ఆ సమయంలో ఆయన విశాఖలో ఉండలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యారు. దీనికి సరికొత్త వక్రభాష్యం చెప్పుకొచ్చారు. మన చేతిలో యంత్రాంగం లేనప్పుడు మనమేం చేయలేం కదా అని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా అబద్ధం చెప్పేస్తున్నారు. తాను విశాలో ఉండి తుపాను సహాయ చర్యల్లో పాల్గొన్ననని అడ్డగోలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే నెటిజెన్లు ఈ విషయంలో ప్రతిపక్ష పాత్ర అందుకున్నారు. నాడు అన్న మాటలను గుర్తుచేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ శ్రేణులకు ఇవి ఇబ్బందికరంగా మారాయి. వాటిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

అంతటా చర్చనీయాంశం..
అయితే ఇటీవల జగన్ వ్యవహర శైలి అటు ప్రభుత్వవర్గాల్లోనూ.. అటు రాజకీయవర్గాల్లోనూ… సొంత పార్టీలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతానికైతే అభివృద్ధి, పాలనలో అన్నివర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న సంగతి తేలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థి దివాళాదిశగా సాగుతుండడాన్ని నిపుణులు సైతం ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రం, పాలన పట్ల అవగాహన ఉన్నవారికి ప్రభుత్వ తీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకుంటున్నారు. జగన్ సర్కారు తీరును అసహ్యించుకున్న వారూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఎవరికీ ఏమీ తెలియదని భావిస్తున్నారో ఏమో జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడానికి వెనుకడుగు వేయడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిసినా వెరవడం లేదు. అందుకే జగన్ మైండ్ సెట్ పై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విపత్తులోనైనా ఆయన ప్రజలకు నేరుగా భరోసా ఇచ్చింది లేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా అదే తీరు. తాను అన్ని ఇచ్చినట్టు చెప్పుకోవడమే కాదు..గత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని సైతం ప్రకటించేస్తుంటారు. తరచూ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు.
పేలవంగా స్పీచ్..
జగన్ ప్రసంగాలు కూడా ఇప్పుడు పేలవంగా సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆయన జిల్లాల పర్యటనలను చుట్టేస్తున్నారు. ఇన్నాళ్లూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్ నొక్కిన ఆయన.. కొత్తగా జిల్లాలకు వచ్చి ఆ పనిచేస్తున్నారు. కొత్తగా ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికో.. రోడ్డు ప్రారంభానికో రావడం లేదు. కేవలం మీట నొక్కేందుకు హంగూ ఆర్భాటలతో వస్తున్నారు. అయితే జనం మాత్రం ముఖం చాటేస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. గతం కంటే ఆయన ప్రసంగాలు మరీ సాదాసీదాగా చప్పగా సాగుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు పరిమితమవుతున్నాయి. ఆయన స్పీచ్ అంతా ఒకే మాదిరిగా ఉంటుంది. తొలుత తాను ప్రారంభించిన పథకం గురించి చెప్పడం ప్రారంభిస్తారు. తరువాత మిగతా పథకాల గురించి చెబుతారు. అటు తరువాత తానో మానవతావాదినంటూ సొంత డబ్బా ప్రారంభిస్తారు. తరువాత చంద్రబాబు, పవన్ ల గురించి ప్రస్తావించారు. పవన్ ను దత్తపుత్రుడిగా అభివర్ణిస్తారు. దుష్టచతుష్టయమంటూ పత్రికాధినేతలను ప్రస్తావిస్తూ తిట్ల దండకానికి దిగతారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగిన సమావేశాల్లో అయితే సీఎం ఎప్పుడు ప్రసంగం ప్రారంభిస్తారా అని జనాలు చూసేవారు. కానీ రానురాను ఆయన ఒకే ధోరణిలో స్పీచ్ ఇస్తుండడంతో జనాలు దిగాలు చెందుతున్నారు. దూరంగా జరిగిపోతున్నారు. చెప్పిందే చెప్పేసరికి వినేవారికి ఆసక్తి తగ్గిపోయింది. అటు మీడియాలో కూడా కవరేజ్ తగ్గింది. అలాగని నేరుగా ఆయన మాట్లాడింది లేదు. పేపరు స్క్రిప్టునే ఆయన చదువుతున్నారు. అయితే దానిని రూపొందిస్తుంది ఎవరో తెలియదు కానీ.. పథకాన్ని బట్టి ప్రారంభపు ఉపన్యాసాన్ని మార్చుతున్నారు. మిగతాది సేమ్ టూ సేమ్ దించేస్తున్నారు. జనాలను బోరు కొడుతున్నారు.