Kalyan Ram Speech In Bimbisara Event: నందమూరి కళ్యాణ్ రామ్ కి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. కొత్తవాళ్లను ముఖ్యంగా కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడనే సాఫ్ట్ కార్నర్ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి లాంటి కొంతమంది దర్శకుల్ని కళ్యాణ్ రామే పరిచయం చేశాడు.

ఈ క్రమంలోనే తన ‘బింబిసార’ సినిమాతో మరో కొత్త దర్శకుడు వశిష్టను పరిచయం చేస్తున్నాడు. ఈ ‘బింబిసార’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే, హీరో కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ గురించి ఈవెంట్ లో మాట్లాడిన మాటలను ప్రస్తుతం ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడాడు ?, కల్యాణ్ రామ్ మాటల్లోనే విందాం.
‘ఈ ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన నా తమ్ముడు ఎన్టీఆర్ కు నేను థ్యాంక్స్ చెప్పను. థ్యాంక్స్ కు బదులు లవ్యూ అంతే..’ అంటూ ఎన్టీఆర్ పై తన ప్రేమను ప్రదర్శించాడు కళ్యాణ్ రామ్. నిజానికి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడింది ఇంతే. కానీ.. కళ్యాణ్ రామ్ స్పీచ్ ఎందుకు వైరల్ అవుతుంది.

ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలను ఎందుకు వైరల్ చేస్తున్నారు అంటే.. కారణం ఉంది. కళ్యాణ్ రామ్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఎన్టీఆర్ ఇలాగే ముందుకు వచ్చి అతన్ని ఆదుకున్నాడు. పైగా ఎన్టీఆర్ ఆర్ట్స్ లో రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేసి.. కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ ను నిలబెట్టాడు. అందుకే.. ఎన్టీఆర్ గురించి మాట్లాడే సమయంలో ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమ కళ్యాణ్ రామ్ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తమ్మీద ‘త్రిగడ్తల రాజ్యపు నెత్తుటి సంతకం – బింబిసారుడి ఏక ఛాత్రాధిపత్యం’ అంటూ నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఈ ‘బింబిసార’ సినిమాని తీసుకువస్తున్నాడు. ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్.. అన్నది ఉపశీర్షిక. ”ఓ సమూహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాశిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవొంచి బానిసలైతే.. అదే ‘బింబిసారుడి విజయం. ఆ విజయాన్ని ఆస్వాదించడానికి ఆ బింబిసారుడి మళ్లీ పుడితే.. అనే కోణంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసినట్టు.. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తన మీసం మెలేశాడు. ఏది ఏమైనా విజయమో, వైఫల్యమో – ఏదీ పట్టించుకోకుండా ప్రయోగాల చేస్తూనే వెళ్తుంటాడు కల్యాణ్ రామ్. కొత్త కథల్ని తెరకెక్కించడం అంటే తనకు భలే సరదా. బింబిసార కూడా అలాంటి ప్రయత్నమే. ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.