YCP- Pawan Kalyan: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పక్షంగా వైసీపీ ఉంది. ప్రధాన విపక్షంగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొందింది.అయితే యువతరం మాత్రం ఈ రెండు పార్టీలను గుర్తించడం లేదు. ఆ రెండు పార్టీaలూ అనామక పార్టీగా గుర్తించే జనసేననే యువత ఓన్ చేసుకుంటున్నారు. రకరకాలుగా ఒత్తిళ్లు పెంచుతున్నాతాము మాత్రం జనసేన గట్టునే నిలబెడతామని నిర్ణయానికి వచ్చారు. తమపై బలవంతంగా రుద్దే ఏ ఉద్యమాన్ని, ప్రయత్నాలను తాము నమ్మే స్థితిలో లేమని బదులిస్తున్నారు.

తాజాగా విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన ఓ ఘటన పొలిటికల్ సర్కిల్ లో సర్క్యులేట్ అవుతోంది. గజపతినగరంలో వైసీపీ మూడు రాజధానులకు మద్దతుగా బలవంతంగా ప్రైవేటు పాఠశాలలు., కాలేజీలకు చెందిన విద్యార్థులను సమీకరిస్తూ భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించింది. తనకున్నఅధికార బలాన్ని ఉపయోగించి వారిని సమీకరించింది. మూడు రాజధానులకు మద్దతుగా ఇదే మా బలం చాటుకునే ప్రయత్నంలో విద్యార్థులు షాకిచ్చారు. అనూహ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కు జై కొట్టారు. ఇది వైసీపీ నేతలకు ఎంతమాత్రం రుచించడం లేదు.
అమరావతి ఏకైక రాజధానికి మద్దతుగా జనసేన స్టాండ్ తీసుకుంది. అటు మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ విశాఖ గర్జనకు పిలుపునిచ్చిన నాడే.. వైసీపీ వర్సెస్ జనసేన మధ్య యుద్ధ వాతావరణం నడిచిన సంగతి తెలిసిందే.దీంతో ఉత్తరాంధ్ర అభివృద్దికి వైసీపీ వ్యతిరేకమన్న భావన వచ్చే రీతిలో ఉద్యమించాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగా బొత్స సత్యనారాయణ కుటుంబానికి పట్టున్న గజపతినగరంలో పాలనావికేంద్రీకరణ, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు మద్దతుగా విద్యార్థులను సమీకరించి భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. గురువారం విద్యాశాఖ అధికారులను టార్గెట్ సైతం పెట్టింది. ఎలాగోలా భయపెట్టి, మందలించి రోడ్డుపై విద్యార్థులను తీసుకొచ్చిన వైసీపీ నేతలకు, స్థానిక అధికారులకు చుక్కెదురైంది.అటు పవన్ నిర్ణయాన్ని జైకొడుతూ కొంతమంది విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని దర్శనమివ్వడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి వికేంద్రీకరణకు మద్దతుగా చేపడుతున్న ఉద్యమం కృత్రిమమైనది. అందుకే ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. కానీ అమరావతి రైతుల పాదయాత్ర గమ్యస్థానానికి చేరేలోపు ఏదో విధంగా ఆటంకం సృష్టించాలన్న ప్రయత్నంలో వైసీపీ ఉంది. అందుకే కొత్త దారులను వెతుక్కుంటూ వస్తోంది. అందులో భాగంగా అధికార దర్పాన్ని ప్రయోగిస్తోంది. అయితే అధికారానికి తలొగ్గి యువత నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారే తప్ప.. తమలో ఉన్న భావాన్ని మాత్రం లోలోపల ఉంచుకోలేక బరెస్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో గజపతినగరంలో పవన్ కు మద్దతుగా విద్యార్థులు ప్రదర్శించిన ప్లకార్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానులను అడ్డుకొవడం అధికార పార్టీ తరం కావడం లేదు.