Rahul Gandhi- Modi: ఒకడొచ్చాడు. పేదనన్నాడు. ప్రేమిస్తానన్నాడు. సమర్థతతో సవారీ అన్నాడు. నమ్మించాడు. ప్రచారంతో ముంచెత్తాడు. అమ్మ మీద ఒట్టేశాడు. నెత్తిన పెట్టుకున్నాక తెలిసింది. వాడు దద్దమ్మకి పెద్దన్నని! మైండ్ గుండు సున్నని ! ఇంటర్నేషనల్ ఎలైట్ బ్రాండ్స్ ఎంజాయ్ చేసేందుకే కుర్చీ ఎక్కాడేమో అనిపిస్తాడు. నటనతో నెట్టుకొస్తాడు. అబద్ధానికి తోబుట్టువు. నిబద్ధానికి నిత్యశత్రువు. చేతగానితనంతో దేశాన్ని ముంచేశాడు. రాజకీయం కోసం పాతళంతో పోటీ పడే భేతాళుడే వాడు. జనం తేరుకునేలోపే… రాక్షస ప్రచారంతో కమ్మేశాడు. దేశాన్ని అయినకాడికి అమ్మేశాడు. ప్రశ్నించిన వాళ్లపై విషం చిమ్మేశాడు. దేశాన్ని నిలువునా ముంచి 20 ఏళ్లు వెనక్కి నెట్టేశాడు.

నేను పేదోణ్ని అని చేసిన ఫేక్ ప్రచారాన్ని నమ్మినందుకు ఇదంతా ఓ జాతి, దేశం చెల్లిస్తున్న మూల్యం. ఇదే అసలు బొమ్మ.
బొరుసొకటుంది. ఓ శ్రీమంతుడున్నాడు. ఐశ్వర్యంలో పుట్టిపెరిగినా దర్పం తెలియదు. జుబ్బా పైజమాలో నిబ్బరానికి నిదర్శనం వాడు. ఐదేళ్ల అధికారాన్ని, ప్రధాని పదవినీ అవలీలగా వదిలేసిన వాడు. భోగాలను వదిలి అభాగ్యుల్ని ఆలింగనం చేసుకుంటాడు. అబద్ధానికి ఆమడ దూరం. వేల కిలో మీటర్లను జనం అడుగులతో దాటుతున్నాడు. రాటుదేలుతున్నాడు. ఆ నవ్వే స్వచ్ఛత. ఆ మాటే అవగాహన. పదవీకాంక్ష అంటని ఆ నడతే దేశానికి మార్పును నేర్పుతోంది. నిద్రలేని నిమిళిత నేత్రాలతో దేశం చూస్తున్న కొత్త పొద్దు ఇది. బురద ముంచుతున్న వేళ స్వచ్ఛత పలకరిస్తున్న తరుణం ఇది.

ఇంత చెప్పుకున్నాక, ఒక అనుమానం రావొచ్చు. ఈ సునిశిత ఆలోచనాపరుడు ఆ భేతాళుణ్ని ఢీ కొట్టగలడా అని ! ఎస్. గుర్రం ఎగరావచ్చు. మాంత్రికుణ్ని మట్టుబెట్టిన తోటరాముడు ఏమంత బలవంతుడని ?