Bangalore : రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి వల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే కూడా ప్రజలు భయపడుతున్నారు. ఈ సారి కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉద్యోగాలు, పనులు, స్కూల్స్ కు వెళ్లే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ తీవ్రత బెంగళూరులో మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం బెంగళూరు పరిస్థితి ఎలా ఉందంటే?
బెంగళూరులో జనవరి 13, 1884న అత్యల్ప ఉష్ణోగ్రత 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆ తర్వాత అంత దారుణమైన ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదు కాలేదు. ఇక నగరంలో 2012లో 12 డిగ్రీల సెల్సియస్, 2019లో 12.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 1884 తర్వాత ఇవే కనిష్ట ఉష్ణోగ్రతలు. ఇక గత గురువారం రోజు బెంగళూరులో కనిష్ట ఉష్ణోగ్రత 16.7 డిగ్రీల సెల్సియస్. , హెమ్మిగెపురాతో అత్యల్పంగా నమోదైంది 14.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
IMD అంచనాలు ప్రకారం రాబోయే రెండు రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 నుంచి 12.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు అని తెలిపారు. ఉదయాన్నే పొగమంచు రావచ్చన్నారు. ఇక బెంగళూరులో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీల సెల్సియస్, 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక కర్నాటకలోని ఇతర ప్రాంతాలలో కూడా చల్లటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్గత ప్రాంతాలు స్థిరీకరించడానికి ముందు కనిష్ట ఉష్ణోగ్రతలలో 2-డిగ్రీల తగ్గుదలని చూడవచ్చు. అయితే తీరప్రాంత కర్ణాటక ప్రభావితం కాకుండా ఉంటుంది.
ఈ నెల ప్రారంభంలో, బెంగళూరులో డిసెంబర్ 16న 12.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది డిసెంబర్ 24, 2011న నమోదైన 12.8 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంది. మరోవైపు, సోమవారం తెల్లవారుజామున ఉష్ణోగ్రత తగ్గుదల, చలి గాలులతో కూడిన వాతావరణం, చలిగాలుల పరిస్థితులు బెంగళురును వేధిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం, ఢిల్లీలో సోమవారం ఉదయం 5.30 గంటలకు 11.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని, గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక రాబోయే మూడు రోజుల బెంగళూరు ఉష్ణోగ్రతలు చూస్తే అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు లో ఈవారం వాతావరణం అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే.
మంగళవారం : గరిష్ట ఉష్ణోగ్రత 27.33 డిగ్రీల సెల్సియస్ గా నమోదైతే.. కనిష్ట ఉష్ణోగ్రత 15.23 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతాయి అంటుంది వాతావరణ శాఖ.
బుధవారం : గరిష్ట ఉష్ణోగ్రత 26.81 డిగ్రీల సెల్సియస్ గా ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత 15.77 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉందట.
గురువారం : గరిష్ట ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్ నమోదైతే కనిష్ట ఉష్ణోగ్రత 14.38 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు.