https://oktelugu.com/

Amit Shah vs TRS: అమిత్ షా చేతిలో టీఆర్ఎస్ ను చిత్తు చేసే అస్ర్తం?

Amit Shah vs TRS: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నాలుగు ఎంపీ, మూడు ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను గెలిపించుకున్న పార్టీని తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణ నేతలతో అమిత్ షా సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహం పెంచుతున్నారు. టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని అధికారం […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 1, 2022 2:57 pm
    Follow us on

    Amit Shah vs TRS: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నాలుగు ఎంపీ, మూడు ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను గెలిపించుకున్న పార్టీని తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణ నేతలతో అమిత్ షా సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహం పెంచుతున్నారు. టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని అధికారం రాబట్టుకోవాలని చూస్తోంది.

    Amit Shah vs TRS

    Amit Shah vs TRS

    ఈ నేపథ్యంలో తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. బీజేపీని బలోపేతం చేసే వ్యూహాల్లో భాగంగా నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల బలాబలాలపై అంచనాలు వేసి వారిని పోటీకి సంసిద్ధులను చేయాలని భావిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి బీజేపీని గట్టెక్కించాలని ప్రయత్నాలు చేస్తోంది.

    Also Read: సంజయ్ పాదయాత్రకు అనుకోని అవాంతరాలు..

    మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోంది. దాన్ని సద్వినియోగం చేసుకుని అధికార పార్టీని దెబ్బకొట్టాలని భావిస్తోంది. ఇప్పటికే దళితబంధు, 317 జీవో, నిరుద్యోగ సమస్య, ధాన్యం కొనుగోలు అంశాలు ప్రభుత్వానికి ఆశనిపాతంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీకి అనుకూలంగా మలుచుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రణాళికలు రచిస్తోంది.

    భవిష్యత్ లో తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం కావాలని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ను సైతం అణగదొక్కాలని చూస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ తన యుక్తులను ప్రదర్శిస్తూ పోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తోంది.

    Also Read: అమూల్ కథ: ఏపీలో ఇన్ ఫుట్.. తెలంగాణలో అవుట్ ఫుట్..

    Tags