Telangana Politics: కాంగ్రెస్ ను కట్టడి చేస్తున్న పార్టీలు.. ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డంకులు

Telangana Politics: తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్యే రాజకీయం సాగుతోంది. మూడో పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కలుగుతోంది. ఇన్నాళ్లుగా లేని గృహ నిర్బంధాలు ఇప్పుడే ఎందుకని ప్రశ్నలు వస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాక ముందు కాంగ్రెస్ పార్టీ కథ అంతే సంగతి అనుకున్నారు. కానీ రేవంత్ వచ్చాక పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. పార్టీలో ఆశలు […]

Written By: Srinivas, Updated On : January 1, 2022 3:09 pm
Follow us on

Telangana Politics: తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్యే రాజకీయం సాగుతోంది. మూడో పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కలుగుతోంది. ఇన్నాళ్లుగా లేని గృహ నిర్బంధాలు ఇప్పుడే ఎందుకని ప్రశ్నలు వస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాక ముందు కాంగ్రెస్ పార్టీ కథ అంతే సంగతి అనుకున్నారు. కానీ రేవంత్ వచ్చాక పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. పార్టీలో ఆశలు నెలకొన్నాయి. ఉనికి తెర మీదకు వచ్చింది. దీంతో కాంగ్రెస్ ను మొత్తం భూస్థాపితం చేయాలనే నిశ్చయంతో రాష్ర్ట ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ చేపట్టే రచ్చబండ సభలకు అనుమతి నిరాకరిస్తోంది. ఫలితంగా రేవంత్ ను హౌస్ అరెస్టు చేస్తూ తన అధికారాన్ని ప్రదర్శిస్తోంది.

Telangana Politics

ఈ క్రమంలో బీజేపీ కూడా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. దీంతో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పడిపోవడంతో ఇక కాంగ్రెస్ కు భవిష్యత్ ప్రశ్నార్థకమే కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం సొంత నియోజకవర్గంలో రచ్చబండ చేయాలని నిర్ణయించినా దాన్ని సజావుగా సాగనివ్వకుండా చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.

Also Read: అమిత్ షా చేతిలో టీఆర్ఎస్ ను చిత్తు చేసే అస్ర్తం?
అక్రమ నిర్బంధాలపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రాజకీయంగా దెబ్బ తగులుతోంది. పార్టీని ఎదగనీయకుండా చేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే కానుంది. ఇప్పటికే దేశంలో కేవలం రాజస్తాన్, పంజాబ్, చత్తీస్ గడ్ స్టేట్లలోనే అధికారంలో ఉన్న పార్టీ భవిష్యత్ అంధకారమే కానుందని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీని ఉద్దేశపూర్వకంగానే అణచివేస్తున్నారని చెబుతున్నారు. ప్రశ్నించే గొంతుకల్ని ఇంకెంత కాలం అణిచివేస్తారో కూడా అర్థం కావడం లేదని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే సీనియర్ల అండ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏమేరకు గట్టెక్కుతుందో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఇంకా ఏం ప్రయత్నాలు చేయాల్సి వస్తుందో కాలమే నిర్ణయించాలి.

Also Read: సంజయ్ పాదయాత్రకు అనుకోని అవాంతరాలు..

Tags