Homeజాతీయ వార్తలుBandi Sanjay: సంజయ్ పాదయాత్రకు అనుకోని అవాంతరాలు..

Bandi Sanjay: సంజయ్ పాదయాత్రకు అనుకోని అవాంతరాలు..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ అందుకున్నాక ఆపార్టీకి బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక తరువాత తెలంగాణలోనే కొంత బలంగా ఉంది. అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన ఉపఎన్నిక ఫలితాలు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలతో కమలనాథుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈసారి తెలంగాణలో కమలం జెండా ఎగరేయాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారంటా.. అందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిచి దిశానిర్దేశం చేశారు అమిత్ షా.

Bandi Sanjay
Bandi Sanjay

అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. బండి పాదయాత్రకు ప్రజలు బాగానే తరలివచ్చారు. దీంతో మలి విడత పాదయాత్ర చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. అయితే అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో పార్టీ నాయకులు నిరాశకు గరువుతున్నారంటా.

మొదటి విడత సంగ్రాయ యాత్ర రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో సాగింది. అయితే పాదయాత్ర చేస్తున్నప్పుడే హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికను బండి దగ్గరుండి పర్యవేక్షించి విజయం సాధించారు. అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, పార్లమెంట్ సమావేశాలు రావడంతో పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. అయితే వీలైన త్వరగా మరోసారి పాదయాత్ర చేపట్టాలని .. అందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. అయితే ఇంతలో కరోనా మరోసారి విజృంభించడంతో మరోసారి ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. దీంతో మరోసారి పాదయాత్రకు బ్రేక్ పడింది.

Also Read: అమూల్ కథ: ఏపీలో ఇన్ ఫుట్.. తెలంగాణలో అవుట్ ఫుట్..

ఇలా వివిధ కారణాలతో పాదయాత్రకు బ్రేకులు పడుతుండడంతో బండి సంజయ్ అనుచురులు తెగ ఫీలైపోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టాలన్నా.. కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇతర మార్గాల ద్వారా ప్రజా సమస్యలపై పోరాడాలని బండి సంజయ్ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. చివరిగా ఓ మాట… ఈసారి తెలంగాణలో కమలం జెండా ఎగరేయాలని ఉవ్విలూరుతున్న కమలదళానికి అడుగడుగునా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ పార్టీ క్యాడర్‌ను నిరుత్సాహపరుస్తున్నాయి.

ఈలోగా మిగతా మార్గాల్లో ప్రజా సమస్యలపై బండి సంజయ్ అండ్ టీమ్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్న తరుణంలో.. ప్రజల్లోకి మరోసారి వెళ్లేందుకు కరోనా అడ్డంకిగా మారడం బీజేపీ శ్రేణులను కాస్త నిరుత్సాహానికి గురి చేస్తోంది.

Also Read: టీ కాంగ్రెస్ లో ముసలం.. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్లు

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version