Ration card : ప్రభుత్వాలు ప్రవేశపేట్ట పథకాలకు పాలకులు ఇచ్చే డబ్బులు వారి సొంతంగా ఇచ్చేవి కావు. పూర్తిగా మనం పన్నుల రూపంలో చెల్లిస్తున్నవే. మనం కష్టపడి కడుతున్న పన్నులను ప్రభుత్వాలు ఉచితాల(Free) రూపొంలో పంచుతున్నాయి. అయితే ఈ ఉచితాలు మరి అర్హులకు అందుతున్నాయా అంటే అదీ లేదు. అర్హుల కన్నా.. అనర్హులే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. మన దేశంలో పేదరికాన్నికి ప్రభుత్వాలు ఇచ్చే సర్టిఫికట్ రేషన్ కార్డు. దశాబ్దాలుగా పాలకులు వీటిని జారీ చేస్తున్నారు. ఎన్ని కార్డులు జారీ చేసినా పేదలు ఇంకా మిగిలే ఉంటున్నారు. కార్డు కావాలన్న విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ప్రస్తుతం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఒక్క కొత్త కార్డు కూడా ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణం. తాము అధికారంలోకి వస్తే కొత్తగా ఆరు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈమేరకు ఇప్పుడు కొత్త కార్డుల జారీకి చర్యలుచేపట్టింది. జనవరి 26 నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. కొత్తగా ఆరు రేషన్ కార్డులు జారీ చేస్తే.. తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 96 లక్షలకు చేరుతుంది. అంటే సుమారు కోటి కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్నట్లే. అంటే.. తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల జనాభాలో మూడు కోట్లకుపైగా పేదవారే అని పాలకులు సర్టిఫికెట్ ఇచ్చినట్లే. ఇంత మంది పేదలు ఉన్నారా అంటే కచ్చితంగా లేరు. కానీ, పాలకులు తమ స్వలాభం కోసం అనర్హులకు కూడా రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు.
అనర్హులకు ప్రజాధనం..
ఇక రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం కోసం కాదు. అన్ని పథకాలకు(SCheams) ఇదే ఆధారంగా మారింది. దీంతో అర్హత లేకపోయినా రేషన్ కార్డును అర్హతగా చూపి చాలా మంది ప్రజా ధనాన్ని పొందుతున్నారు. చాలా మందికి తగిన ఆదాయం ఉన్నా.. ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతుఆన్నరు. అసలైన పేదలకు అందాల్సిన సాయం అనర్హుల ఖాతాల్లోకి వెళ్తోంది. చాలా మంది సంపన్నులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మంత్రులకు కూడా రేషన్‌కార్డులు ఉన్నాయి.
ఓట్ల కోసమే..
రేషన్ కార్డులు అనర్హులకు ఉన్నాయన్న విషయం పాలకులకు తెలుసు. అయినా వాటి జోలికి వెళ్లరు. కారణం ఏంటంటే కార్డు తీసేస్తే వచ్చే ఎన్నికల్లో వీరు గెలవరనే భయం. రేషన్ కార్డుల తొలగింపు ప్రభావం లక్షల మందిపై పడుతుంది. దీంతో ఆ ఓట్లన్నీ తమకు వ్యతిరేకంగా పడితే మళ్లీ అధికారంలోకి రాలేమని పాలకులు అనర్హుల రేషన్ కార్డు తొలగించడానికి జంకుతున్నారు. తాజాగా పొన్నం ప్రభాకర్ కూడా అదే ప్రకటించారు. పాత కార్డులు ఒక్కటి కూడా తొలగించమని ఇప్పటికే స్పష్టం చేశారు.