Delhi: దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కీలకమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. కాగా, ఈ ఎన్నికల నేపథ్యంలో సమర్థవంతమైన పాలన, నాయకుడి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరుగుతోంది. అందులో దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి చర్చ ఎక్కువ శాతం జరుగుతోంది. .ప్రజల నిజమైన అభివృద్ధికి కేజ్రీవాల్ పని చేస్తున్నాడని అంటున్నారు.
దేశంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సంక్షేమం పేరిట వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజలకు రకరకాల పథకాలు అందిస్తున్నారు. అలా తాము మళ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి రావాలనే అంచనాలను వేసుకుంటున్నారు. కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తన దైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఆయన నాయకత్వంలో ఢిల్లీ ఒక్క రూపాయి కూడా అప్పు లేని రాష్ట్రంగా అవతరించింది. ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వేత్తగా మారి.. తనదైన శైలిలో పాలన చేస్తున్నారు.
సమర్థవంతమైన పాలన అంటే ఏంటో మాటల్లో కాకుండా చేతల్లోనూ చూపిస్తున్నాడు. అన్ని వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాడు. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితంగా అందిస్తున్నారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇకపోతే ఆనంద వేదిక కార్యక్రమం అద్భుతంగా స్కూల్స్ లో కండక్ట్ చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాలు ఎప్పటికప్పుడు పాఠశాలలను పర్యవేక్షిస్తున్నారు.
Also Read: మెటా దెబ్బకు భారీగా నష్టపోయిన జుకర్ బర్గ్.. అతన్ని మించిపోయిన అంబానీ, అదానీ..
స్కూల్స్ కు హెడ్ మాస్టర్ తో పాటు ఎస్టేట్ మేనేజర్ అనే వ్యక్తిని నియమించారు. వారు పాఠశాలలో అవసరమయ్యే మౌలిక వసతుల నిర్వహణ, వివిధ ఏర్పాట్లు మరమ్మతులు చేయిస్తుంటారు. ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులకు ఈ విషయాలపై సంబంధం లేకుండా చేశాడు. అలా విద్యార్థులపైన ఉపాధ్యాయులు ఫోకస్ చేసేలా చేశారు. ఇతర రాష్ట్రాలు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసిన వివిధ పథకాలు ప్రవేశపెడుతున్న క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ అసలు అప్పు అనేది లేని రాష్ట్రంగా ఢిల్లీని తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ పాలన గురించి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సాధారణ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ పాలన గురించి చర్చించుకుంటున్నారు. పంజాబ్ లో ఆప్ పార్టీ పోటీ చేస్తున్నది. పంజాబ్ లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి అనుకున్న స్థాయిలో విజయం లభిస్తే కనుక దేశవ్యాప్తంగా ఆయన ఇంకా పాపులర్ అవుతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి.. పంజాబ్‌లో ఎటువంటి ఫలితం వస్తుందో చూడాలి..
Also Read: ఉద్యోగులకు బాసటగా బాబుః జగన్ కు తలనొప్పేనా?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: The rule means kejriwal delhi as a debt free state
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com