Homeజాతీయ వార్తలుAmbani, Adani: మెటా దెబ్బ‌కు భారీగా న‌ష్ట‌పోయిన జుకర్ బర్గ్.. అత‌న్ని మించిపోయిన అంబానీ, అదానీ..

Ambani, Adani: మెటా దెబ్బ‌కు భారీగా న‌ష్ట‌పోయిన జుకర్ బర్గ్.. అత‌న్ని మించిపోయిన అంబానీ, అదానీ..

Ambani, Adani: ఇప్పటి వరకు ప్రపంచ కుబేరులుగా విదేశీయులు ఉన్నారు. అయితే, ఆ జాబితాలో భారతీయులు కూడా ఉన్నారు. కానీ, విదేశీయుల తర్వాత స్థానంలోనే ఉండేవారు. కాగా, తాజాగా పరస్థితులు మారిపోయాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ టెన్ లో ఉండే మార్క్ జుకర్ బర్గ్ పరిస్థితి పూర్తిగా మారిపోగా కుబేరుల జాబితాలోకి అంబానీ, ఆదానీ చేరిపోయారు. మార్క్ జుకర్ బర్గ్ ఆదాయం పడిపోవడానికి గల కారణాలేమిటంటే..

Ambani, Adani
Ambani, Adani

దిగ్గజ సోష్‌ల్ మీడియా యాప్ ‘పేస్ బుక్’ పేరెంట్ కంపెనీ అయిన ‘మెటా ప్లాట్ ఫార్మ్స్ ఇంక్’ క్వార్టర్ త్రీలో నిరుత్సాహకరమైన ఆదాయాలను నమోదు చసింది. దాంతో మెటా షేర్లు రికార్డు స్థాయిలో పతనం అయిపోయాయి. అలా మెటా కంపెనీకి నష్టాలు ఎవరూ ఊహించని స్థాయిలో నమోదు అయ్యాయి. మెటా కంపెనీకి మొత్తంగా 200 బిలియన్ డాలర్ల నష్టం వచ్చేసింది. అలా ఇందులో వాటా కలిగిన జుకర్ బర్గ్ కు కూడా నష్టం వచ్చింది. అలా ఒకే ఒక్క రోజులో జకర్ బర్గ్ సంపద బాగా ఆవిరిపోయింది. చరిత్రలో నమోదైన అత్యంత భారీ నష్టాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. గతేడాది నవంబర్ లో‘టెస్లా’ కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ఒకే ఒక్క రోజులో 35 బిలియన్ డాలర్లు కోల్పోయాడు. కాగా, మార్క్ జుకర్ బర్గ్ ఒకే ఒక్క రోజులో 29 బిలియన్ డాలర్లు నష్టపోవడం గమనార్హం.

Ambani, Adani
Ambani, Adani

Also Read: ఉద్యోగులకు బాస‌ట‌గా బాబుః జ‌గ‌న్ కు త‌ల‌నొప్పేనా?
ప్రత్యర్థి కంపెనీలు అయినటువంటి ‘యూట్యూబ్, టిక్ టాక్’ నుంచి ఫేస్ బుక్ కు పోటీ ఎదురైన నేపథ్యంలో యూజర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. అలా మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ షేర్లు పడిపోవడానికి పలు కారణాలు ఏర్పడ్డాయి. ఫోర్బ్స్ డేటా ప్రకారం.. మెటా సీఈవో జుకర్ బర్గ్ ఆస్తుల నికర విలువ 85 బిలియన్ డాల్లరకు పడిపోవడం గమనార్హం.

అలా సంపద భారీగా తగ్గడం వలన జుకర్ బర్గ్.. ప్రపంచ కుబేరుల జాబితాలో 12 వ స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలోనే భారతీయు కుబేరు అయిన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ కంటే తక్కువగా జుకర్ బర్గ్ ఆస్తులు ఉండటం గమనార్హం. అలా అంతర్జాతీయ కుబేరుల జాబితాలో పదో స్థానంలో అదానీ, పద కొండో స్థానంలో అంబానీ ఉన్నారు. అదానీ ఆస్తుల విలువ 90.1 బిలియన్ డాలర్లు కాగా, అంబానీ ఆస్తుల విలువ 90 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద 20 మిలియన్ డాలర్లు పెరిగింది.

Also Read: సమతామూర్తి విగ్రహ నిర్మాణంలో ప్రత్యేకతలు ఇవే..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular