PM Narendra Modi : నరేంద్ర మోడీ శరీర సామర్థ్యానికి సంబంధించి చాలా మందికి తెలిసినవి పై విషయాలు మాత్రమే. అయితే నరేంద్ర మోడీ ఏం తింటారు? ఏం తాగుతారు? ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తారు? అనే విషయాలు ఇంతవరకు ఎవరికీ పెద్దగా తెలియదు. పైగా ఆ విషయం ఆయన ఇంతవరకు బయట పెట్టలేదు. సాధారణంగా అయితే వేప ఆకును, వేప పువ్వును నరేంద్ర మోడీ తింటారు. తన జన్మదినం రోజు పప్పు, రోటి, ఫ్రూట్ సలాడ్ తినడానికి నరేంద్ర మోడీ ఇష్టపడతారు. అందులో చివరగా కాస్త దంపుడు బియ్యంతో చేసిన అన్నాన్ని తింటారు. ప్రసిద్ధమైన బిహారి వంటకం లిట్టి చోఖా ను నరేంద్ర మోడీ ఇష్టంగా తింటారు. కిచిడీ, డ్రమ్ స్టిక్ పరోటాను కూడా ఆస్వాదిస్తారు. పానీ పూరి , గుజరాతి వంటకం డోక్లా ను ఇష్టంగా తింటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక గుజరాత్ లో విరివిగా లభించే శ్రీ ఖండ్ అనే పాలు, మీగడ, వెన్న, బాదంపప్పు, జీడిపప్పు, బెల్లం మిశ్రమంతో తయారుచేసే మిఠాయిని కూడా తింటారు. అలాగే టమాటాలతో తయారుచేసే సేవ్ తమ్ తర్ కీ సబ్జీ కూడా నరేంద్ర మోడీకి చాలా ఇష్టం. అయితే ఇప్పటివరకు వీటి గురించి మాత్రమే చాలామందికి తెలుసు. అయితే తొలిసారిగా నరేంద్ర మోడీ తాను ఏం తింటారో.. ఎక్కువగా ఏం తింటారో.. తన ఆరోగ్యానికి కారణమేమిటో చెప్పేశారు.
ఏడాదిలో 300 రోజు అదే తింటాను
బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇదే క్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఏడాది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 2000 చొప్పున 3 విడుతలుగా జమ చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం ప్రారంభమైంది. ఇక ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఎన్నికలను నేపథ్యంలో భాగల్పూర్ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఇదే సమయంలో తన ఆరోగ్యానికి కారణమేమిటో నరేంద్ర మోడీ వివరించారు. “ఫుల్ మఖానా(తామర గింజలు) అంటే నాకు చాలా ఇష్టం. ఏడాదిలో 300 అదే తింటాను. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. దేశంలో చాలామంది అల్పాహారంలో మఖాన తింటున్నారు. దీని ఉత్పత్తి ఇంకా పెరగాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది జీర్ణ క్రియ వృద్ధికి సహకరిస్తుంది. దాంతోపాటు శరీరానికి కావలసిన విటమిన్లను అందిస్తుంది. ఫలితంగా శరీర వృద్ధి బాగుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో మఖాన తోడ్పడుతుంది. యాంటీ ఏజింగ్ కు మఖాన సహకరిస్తుందని” నరేంద్ర మోడీ వివరించారు. అయితే మఖాన ఉత్పత్తి ఇంకా పెరగాలని ఆయన కోరారు. తామర పువ్వుల సేద్యం వల్ల మఖాన ఉత్పత్తి పెరుగుతుందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత మఖాన ఉత్పత్తి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని.. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇటీవలి బడ్జెట్లో బీహార్ రాష్ట్రంలో మఖాన బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నిర్మల సీతారామన్ మఖాన బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయంగా విమర్శలకు కారణమైంది. బీహార్ రాష్ట్రంలో మఖాన ఉత్పత్తి భారీగానే ఉంది. దీని మీద ఆధారపడి వేలాది మంది రైతులు జీవిస్తున్నారు. అయితే దీని ఉత్పత్తిని మరింత పెంచడానికి కేంద్రం ఏకంగా బీహార్ రాష్ట్రంలో మఖాన బోర్డును ఏర్పాటు చేసింది.