S S Rajamouli-Ram Charan : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో అపజయం అనే పదం కూడా తెలియని డైరెక్టర్ ఎవరు అంటే జనాలు ఏకపక్షంగా చెప్పే పేరు రాజమౌళి(SS Rajamouli). శాంతి నివాసం అనే సీరియల్ చేస్తూ, రాఘవేంద్ర రావు ప్రోత్సాహంతో మధ్యలో ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కి ఇది రెండవ చిత్రం. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రం లోని పాటలు అప్పట్లో ఒక సెన్సేషన్. ఇప్పటికీ కూడా ఈ పాటలను మనం ఎదో ఒక సందర్భంలో వింటూనే ఉంటాము. సినిమా కథ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమా అంటే ఎందుకో రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కి పరమ అసహ్యం. అనేక సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ముందుగా ప్రభాస్ చేయాలి.
కానీ ఆయనకు స్టోరీ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ తో చేసాడు రాజమౌళి. ఈ సినిమా అంటే ఇష్టం లేని హీరో కేవలం ప్రభాస్ ఒక్కడే కాదు, రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా అంటే అసలు ఇష్టం ఉండదట. ఈ విషయాన్ని నేరుగా రాజమౌళి ముఖం మీదనే చెప్పాడట అప్పట్లో రామ్ చరణ్(Global star Ramcharan). ఈ విషయం పై అప్పట్లో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి వాదనలు కూడా జరిగాయట. అసలు ఈ సినిమా నచ్చకపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ ఆడియన్స్ కి అర్థం కాలేదు. ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ లిస్ట్ తీస్తే, ఆడియన్స్ ఎంచుకునే సినిమాలలో స్టూడెంట్ నెంబర్ 1 కచ్చితంగా ఉంటుంది. అయితే ఆ సినిమా కాస్త క్లాస్ గా ఉంటుంది. రామ్ చరణ్, ప్రభాస్ మాస్ హీరోలు కాబట్టి వాళ్లకు ఈ సినిమా నచ్చలేదా? అని అనుకుంటున్నారు విశ్లేషకులు.
ఇకపోతే #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు అవ్వని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది అనే రూమర్ ఉంది. రీసెంట్ గానే ప్రియాంక చోప్రా చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్ లో జాయిన్ అయ్యింది. మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యాక, ఈ చిత్రానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నారు రాజమౌళి,మహేష్. అంతే కాదు, ఉగాదికి ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ గా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ని విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయట.