https://oktelugu.com/

Real Estate In Telangana: తెలంగాణ భూమి బంగారం.. వ్యాపారుల కష్టానికి దక్కిన గౌరవం

Real Estate In Telangana: తెలంగాణ వస్తే చిమ్మీ చీకట్లు కమ్ముకుంటాయని మాజీ సీఎం కిరణ్ బోర్డుపై చూపిస్తూ మరీ బెదిరించాడు. సాగు, తాగునీళ్లకు అష్టకష్టాలు పడుతారని బెదిరించారు. కానీ తెలంగాణ వచ్చింది.. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రాజెక్టులతో నీటి సామర్థ్యం పెరిగి ఇప్పుడు దేశానికే తెలంగాణ అన్నపూర్ణ అయ్యింది. రైతుబంధుతో తెలంగాణ భూమి బంగారమైంది. అందుకే ఇప్పుడు పక్కనున్న ఏపీ కంటే కూడా దేశంలోని చాలా రాష్ట్రాలను అధిగమించి తెలంగాణలో ‘రియల్ ఎస్టేట్’ ఒక పండుగలా మారింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2021 / 06:22 PM IST
    Follow us on

    Real Estate In Telangana: తెలంగాణ వస్తే చిమ్మీ చీకట్లు కమ్ముకుంటాయని మాజీ సీఎం కిరణ్ బోర్డుపై చూపిస్తూ మరీ బెదిరించాడు. సాగు, తాగునీళ్లకు అష్టకష్టాలు పడుతారని బెదిరించారు. కానీ తెలంగాణ వచ్చింది.. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రాజెక్టులతో నీటి సామర్థ్యం పెరిగి ఇప్పుడు దేశానికే తెలంగాణ అన్నపూర్ణ అయ్యింది. రైతుబంధుతో తెలంగాణ భూమి బంగారమైంది. అందుకే ఇప్పుడు పక్కనున్న ఏపీ కంటే కూడా దేశంలోని చాలా రాష్ట్రాలను అధిగమించి తెలంగాణలో ‘రియల్ ఎస్టేట్’ ఒక పండుగలా మారింది. ఈ పండుగను మరింత ప్రోత్సహించేందుకు ‘రియట్ ఎస్టేట్ అవార్డ్స్ 2021’ను నిర్వహించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో రియల్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

    Real Estate In Telangana

    దీనికి తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్ తదుపరి హైదరాబాద్ మహానగరంగా పరిఢవిల్లనుందన్నారు.సుమారు 15 నుంచి 20 జిల్లాలను కలుపుకుంటూ రిజనల్ రింగ్ రోడ్ రానుందన్నారు.

    నిజామాబాద్, ఆదిలాబాద్ , వరంగల్ మినహాయిస్తే మిగిలిన జిల్లాలకు త్రిబుల్ ఆర్ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఎయిర్ పోర్టు నుంచి మహబూబ్ నగర్ వరకూ గంట ప్రయాణంలోనే వెళ్లొచ్చాన్నారు. హైదరాబాద్ అన్నింటికి అనువైన ప్రాంతమని.. గాలి, నీరు, వాతావరణం చక్కగా ఉంటుందని ఇతర దేశంలోని నగరాలతో పోలిస్తే దేశంలో అత్యంత సురక్షిత నగరం హైదరాబాద్ అని చెప్పుకొచ్చాడు.

    నీరు, విద్యుత్, శాంతిభద్రతల పరిరక్షణ ఉంటే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల స్తాపన జరుగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుకుంటూ వ్యాపార విస్తరణలో భాగస్వాములవుతున్నారని మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు.

    భూమిని నమ్ముకుంటే ఎవరూ చెడిపోరని.. భూమి మీద పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా రెట్టింపు అవుతుందన్నారు. బ్యాంకుల్లో ఎవరూ డబ్బును దాచుకోకుండా భూముల మీద పెట్టుబడులు పెడుతున్నారన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెడితే వందకు వంద శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Real Estate Awards Invitation

    – వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి రియల్ ఎస్టేట్ తోనే: మురళీమోహన్
    దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించేది రియల్ ఎస్టేట్ రంగమేనని నటుడు, నిర్మాత, జయభేరి గ్రూప్ అధినేత మురళీమోహన్ అన్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ లో భూములు, ఇళ్లు కొన్నవారు ఒకటికి పది రెట్లు లాభం పొందినవారేనని.. ఎవరూ నష్టపోయిన దాఖలాలు లేవన్నారు. మంచి స్థలంలో పెట్టుబడులు పెట్టి పదేళ్లు ఆగితే 100 రెట్లు రేటు పెరిగిన ఉదంతాలు ఉన్నాయని మురళీ మోహన్ అన్నారు. స్టాక్ మార్కెట్ సహా వేరే రంగాల్లో పెట్టుబడులు పెడితే డబ్బులు వెనక్కి వస్తాయో తెలియదని.. కానీ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడితే ఖచ్చితంగా వస్తాయన్నారు. ఎన్నో రంగాల్లో అవార్డులు ఇస్తున్నారని.. కానీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.

    Also Read: ప్రభుత్వంతో ‘ఫైట్’కు సిద్ధమవుతున్న సినీ ఎగ్జిబిటర్లు..!

    ఇటు సాగునీటి పారుదల పెరగడం.. కేసీఆర్ సర్కార్ అభివ్రుద్ధి మంత్రంతో ఇప్పుడు తెలంగాణ ఏ మూల పోయినా 15 లక్షలకు తక్కువగా ఎకరం ఎక్కడా లేదు. హైదరాబాద్ లో అయితే కోట్లు కుమ్మరించాల్సిందే. కరోనా చేయబట్టి కాస్తా రియల్ రంగం ఊపు తగ్గినా ఇప్పటికీ దేశంలోనే నంబర్ 1 తెలంగాణ ‘రియల్ ఎస్టేట్’ రంగంలో ఉంది. దాని చుట్టూ ఎంతో మంది వ్యాపారులు, ఉద్యోగులు ఆధారపడి ఉన్నారు. తెలంగాణలో భూమికి ఇప్పుడు రెక్కలొచ్చాయి. అత్యంత ఖరీదైనదిగా మారిందనే చెప్పాలి. ఈ రియల్ ఎస్టేట్ పండుగతో అది మరోసారి స్పష్టమైనట్టు అయ్యింది.

    Also Read: కేసీఆర్ చాణక్య వ్యూహం.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు నయా ప్లాన్..