https://oktelugu.com/

Rajini Kanth: సాలిడ్ లైన్ అప్ తో రెడీ అవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్…

Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రజినీకి కేవలం ఇండియా లోనే కాక విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అన్నాత్తే” తో మళ్ళీ సాదాసీదా హిట్ నే అందుకున్నారు. తన స్టార్ డమ్ కి తగ్గ సినిమా అయితే ఇది కాదని మాత్రం ప్రూవ్ అయ్యింది. ఇక దీనితో మళ్ళీ రజినీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 22, 2021 / 06:07 PM IST
    Follow us on

    Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రజినీకి కేవలం ఇండియా లోనే కాక విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అన్నాత్తే” తో మళ్ళీ సాదాసీదా హిట్ నే అందుకున్నారు. తన స్టార్ డమ్ కి తగ్గ సినిమా అయితే ఇది కాదని మాత్రం ప్రూవ్ అయ్యింది. ఇక దీనితో మళ్ళీ రజినీ నెక్స్ట్ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తలైవా నెక్స్ట్ ఎవరితో చేస్తారు అనే దానికి సమాధానం ఉంది.

    Rajini Kanth

    Also Read: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

    కాగా అనంతరం చేయబోయే సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. వేరే ఇద్దరు దర్శకులు రజిని లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వారిలో ఒకరు కార్తీక్ సుబ్బరాజ్ కాగా ఇంకొకరు బల్కి తో అని తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు ఒక్కో ఇంట్రెస్టింగ్ కథను తీసుకొచ్చారట. కార్తీక్ సుబ్బరాజ్ మళ్ళీ “పేట” లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ ని తీసుకురాగా బల్కి మాత్రం ఓ సాలిడ్ సబ్జెక్టు ని తీసుకొచ్చారట. అయితే ఇదంతా చాలా రియలిస్టిక్ డ్రామాలా ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లు లేకుండా కేవలం నటీనటుల పెర్ఫామెన్స్ ఆధారంగా ఉంటుందని తెలుస్తుంది. మరి వీటిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. రజిని మళ్ళీ ఒక సాలిడ్ హిట్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో రజినీకి ఎవరు సాలిడ్ హిట్ ఇస్తారో వేచి చూడాలి.

    Also Read: ఆర్‌ఆర్‌ఆర్ తో కలిసిన మరో ఆర్… వైరల్ గా మారిన ఫోటో