https://oktelugu.com/

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ తో కలిసిన మరో ఆర్… వైరల్ గా మారిన ఫోటో

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుండి వస్తోన్న చిత్రం… అలాగే టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు అగ్రహీరోలు కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జనవరి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 22, 2021 / 06:23 PM IST
    Follow us on

    RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుండి వస్తోన్న చిత్రం… అలాగే టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు అగ్రహీరోలు కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు రాజమౌళితో పాటు తారక్, చరణ్‌లు కొన్ని రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేస్తున్నారు.

    RRR Movie Team

    Also Read: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి… బుద్దా అరుణకి కారు బహుమతి

    అయితే “రౌద్రం రణం రుధిరం” పేరుతో వస్తున్న ఈ చిత్రాన్ని అభిమానులు మాత్రం మూడు ఆర్ లను రాజమౌళి, రామ్ చరణ్, రామారావు గా వర్ణిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ముంబైలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కి ఇప్పుడు మరో ఆర్ యాడ్ అయ్యింది. ఆ ఆర్ ఎవరు అని అనుకుంటున్నారా… అంతను ఎవరో కాదు. ‘బాహుబలి’ చిత్రంలో భళ్లాలదేవుడిగా విశ్వరూపం ప్రదర్శించిన రానా దగ్గుబాటి. ‘‘ఈరోజు ముంబైలో రాజమౌళి, రామ్ చరణ్, రామారావులతో ఉన్న పిక్‌ని రానా దగ్గుబాటి పోస్ట్ చేశారు. జక్కన్న స్టయిల్ ఎలా ఉంటుందో రానాకు బాగా తెలుసు. అలానే రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. ఈ ముగ్గురితో పాటు రాజమౌళి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుందో అని అబిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ ఇంటర్వ్యూను విడుదల చేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Also Read: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు… కృష్ణా, విజయనగరం జిల్లాలో ఎన్ని సీజ్ చేశారంటే

    Tags