-వేలాదిగా తరలివచ్చిన వారితో జనసంద్రమైన మొయినాబాద్
-పాదయాత్రలో ప్రజా సమస్యలపైనే ద్రుష్టి కేంద్రీకరించిన సంజయ్
-కనక మామిడిలో డబుల్ బెడ్రూం ఇండ్ల శిలాఫలకాన్ని సందర్శించిన బండి
-టీఆర్ఎస్ మోసపు హామీలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకే పాదయాత్ర
-4వ రోజు పాదయాత్రకు తరలివచ్చిన అశేష ప్రజానీకం
-సెప్టెంబర్ 4న దేవేంద్ర ఫడ్నవీస్, 7న తేజస్వీ సూర్య రాక
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 4వ రోజు పూర్తిగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై దృష్టి సారించారు. చిలుకూరు చౌరస్తా (హిమాయత్ నగర్) నుండి కేతిరెడ్డిపల్లి వరకు 12 కి.మీలకు పైగా పాదయాత్ర నిర్వహించిన సంజయ్ వివిధ చేతి వృత్తుల వారిని కలుసుకున్నారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘‘కమ్మరి కొలిమికి వెళ్లి వారితో సంభాషించారు. ఎడ్లబండి రైతుల వద్దకు వెళ్లి వారి బాధలు విన్నారు. వికలాంగులను కలిసి మొర విన్నారు. నిరుద్యోగులను కలిసి వారి వెతలు కన్నారు. వీరితోపాటు రైతులు, మహిళలు, పిల్లలు, వ్రుద్దులు సహా అన్ని వర్గాల ప్రజలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి బాధలను, వెతలను ఓపిగ్గా వింటూనే ‘నేనున్నా. బీజేపీ అండగా ఉంటుంది’’ అంటూ అందరికీ భరోసా ఇస్తూ ముందుకు కదిలారు.
మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కనకమామిడి సమీపంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం వేసిన శిలాఫలకాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీనియర్ నాయలకులతో కలిసి సందర్శించారు. శిలాఫలకమే తప్ప ఇప్పటి వరకు ఆ స్థలంలో కనీసం మట్టి కూడా తీయలేదు. ఒక్క పునాది కూడా తీయలేదు. ఆర్భాటంగా శంకుస్థాపన చేసి విస్మరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ ‘‘ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. జనాన్ని మభ్యపెట్టేందుకు శిలాఫలకాలకే పరిమితమయ్యారే తప్ప చేసిందేమీ లేదు. పాదయాత్ర లో ప్రజా సమస్యలు చాలా బయటకు వస్తున్నాయి. ఈ సమస్యలను బయటకు తీసుకొచ్చేందుకే పాదయాత్ర చేస్తున్నా. అబద్దపు మాటలు, మోసపూరిత హామీలను ప్రజా క్షేత్రంలోనే ఎండగడతా’’అని పేర్కొన్నారు.
చిలుకూరు చౌరస్తా (హిమాయత్ నగర్) నుండి ప్రారంభమైన బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు జనం పోటెత్తారు. వేలాది మంది జనం తరలివచ్చారు. పెద్ద ఎత్తున మహిళలలు బోనాలతో ఎదురేగి స్వాగతం పలికారు. కనీవినీ ఎరగని రీతిలో యువత కదం తొక్కింది. కాషాయ టోపీలు ధరించి సంగ్రామ సేన అలుపు లేకుండా బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలారు.
మొయినాబాద్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొయినాబాద్ వద్దకు సంజయ్ రాగానే వేలాదిగా ప్రజలు తరలిరావడంతో జన సంద్రమైంది. మూడు కి.మీ పరిధిలో ట్రాఫిక్ జాం అయ్యింది. వేలాది మంది ప్రజల ను ఉద్దేశించి బండి సంజయ్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో, జాతీయ కార్యవర్గ సభ్యులు సంబిత్ పాత్రో కేసీఆర్ సర్కార్ అవినీతి, అక్రమాలు, నియంత పాలనపై విరుచుకుపడ్డారు.
-సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డ జనం
బండి సంజయ్ ను కలిసేందుకు, సెల్ఫీలు దిగేందుకు చిన్న పిల్లలు, వ్రుద్దులు, మహిళలు సైతం ఉత్సాహం చూపారు. గోషా మహాల్ నుండి గోపికా వేషధారణలో తన పిల్లలతో కలిసి వచ్చి ఓ కుటుంబం మొయినాబాద్ వచ్చి పాదయాత్ర కు సంఘీభావం తెలుపుతూ ఓ కుటుంబం జై బీజేపీ, జై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. రోడ్ పై వెళ్లే వాహనదారుల నుండి బండి పాదయాత్ర కు విశేష స్పందన లభించింది. బస్సుల్లో, ఆటోల్లో, బైకుల్లో వెళుతున్న వారంతా బండి సంజయ్ వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగుతూ యాత్రకు సంఘీభావం తెలిపారు.
మరోవైపు బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో కొన్ని టీవీ ఛానళ్లతో మాట్లాడుతూ బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రతో టీఆర్ఎస్ నేతల్లో గుండెలు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను పాదయాత్ర హీరో గా అభివర్ణించారు. తెలంగాణ లో అవినీతి పాలన జరుగుతుందని మండిపడ్డారు. 2023లో కేసీఆర్ ను గద్దెదించి తీరుతామని అన్నారు.
కనకమామిడి గ్రామంలో ఎడ్ల బండి ఎక్కి రైతుల సమస్యలను పలకరించారు. యాత్రలో ఎదురుపడిన రైతన్నలతో ముచ్చటించారు. బండికి స్వాగతం. ఎడ్ల బండి ఎక్కిన బండి సంజయ్. ఎడ్ల బండి పై ఎక్కి రైతు సమస్యను అడిగి తెల్సుకున్న బండి సంజయ్. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కొలన్ లక్ష్మ రెడ్డి, వారి అనుచరులతోపాటు భువనగిరి నియోజకవర్గ పరిధిలోని బీబీనగర్ మండలం నుండి భారీ ఎత్తున నాయకులు సంజయ్ సమక్షలో బీజేపీలో చేరారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డీ గ్రామం చేరుకున్న బండి సంజయ్ కేతిరెడ్డీపల్లె గ్రామంలో రాత్రి బస చేస్తున్నారు. ఈరోజు బండి సంజయ్ చిలుకూరు చౌరస్తా నుండి కేతిరెడ్డిపల్లె గ్రామం వరకు మొత్తం 12 కి.మీలు నడిచారు. నాలుగు రోజుల పాటు సుమారు 50 కిలోమీటర్లు బండి సంజయ్ పాదయాత్ర చేశారు.
సెప్టెంబర్ 4న వికారాబాద్ లో జరిగే పాదయాత్రకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్, 7న సంగారెడ్డిలో జరిగే పాదయాత్రకు బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ తేజస్వీ సూర్య పాల్గొననున్నారు.
-ఈరోజు బండి సంజయ్ తోపాటు పాల్గొన్న ప్రముఖ నేతలు
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో, కర్నాటక ఎంపీ మ్యూనిస్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, మహిళ మోర్చా అధ్యక్షురాలు గాతా మూర్తి, యువ మోర్చా అధ్యక్షుడు బాను ప్రకాష్, కిసాన్ మోర్చా శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, పాదయాత్ర సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు నారాయణ్ రెడ్డి, జె.సంగప్ప కె. రాములు..ప్రభాకర్.
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, జిల్లా నేతలు కంజర్ల ప్రకాశ్, అంజన్ కుమార్ గౌడ్, జక్కా రవీందర్ రెడ్డి, యాదీష్, బచ్చగాళ్ల రమేశ్, ప్రభాకర్ రెడ్డి, జంగారెడ్డి, పాపయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: The popular bandisanjay praja sangrama yatra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com