
డ్రగ్స్ కేసు వ్యవహారంలో సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ను ఈడీ ఈరోజు సుధీర్ఘంగా విచారించింది. దాదాపు 10 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో అధికారులు పలు కోణాల్లో ఆయనను ప్రశ్నించారు. పూరితోపాటు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ శ్రీధర్ ను కూడా ఈడీ అధికారులు పలు అంశాలపై ఆరాతీసినట్లు సమాచారం.
– చర్చనీయాంశంగా మారిన బండ్ల గణేష్
పూరి జగన్నాథ్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలోనే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీంతో గణేష్ ను అధికారులు కార్యాలయానికి రప్పించారని తెలిసింది. ఈ విషయంలో ఆయన్ను కూడా ప్రశ్నించినట్టు సమాచారం.
అయితే డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని బండ్లగణేష్ మీడియాకు తెలిపాడు. విచారణ లో ఉన్న పూరి జగన్నాథ్ ను కలవడానికి వచ్చానని స్పష్టం చేశారు. అమ్మ మీద ఒట్టు నాకేం తెలియదన్నారు.పూరి జగన్నాధ్ ను కలవడానికి మాత్రమే వచ్చానన్నారు. పూరి నామిత్రుడు ఉదయం వచ్చాడు..ఏం జరిగిందోనని టెన్షన్ గా ఉంది అందుకే తెలుసుకోడానికి వచ్చానని బండ్ల గణేష్ తెలిపాడు.
10 గంటలుగా పూరిని ఈడీ అధికారులు విచారించారు. ఈడీ కార్యాలయానికి చేరుకున్న నిర్మాత బండ్ల గణేష్. ఈడీ కార్యాలయంలోనే పూరి కుమారుడు ఆకాష్ పూరి, సోదరుడు సాయిరాం శంకర్, అడిటర్ సతీష్ ఉన్నాడు.