Homeఎంటర్టైన్మెంట్Trisha and Star Hero: : త్రిష తో నటించి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు...

Trisha and Star Hero: : త్రిష తో నటించి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు ఎవరో తెలుసా..?

Trisha and Star Hero: ‘వర్షం’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన నటీమణి త్రిష… అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు తమిళ భాషల్లో సినిమాలను చేస్తూ తను టాప్ హీరోయిన్ గా ముందుకు సాగుతుంది. దాదాపు 20 సంవత్సరాలకు పైన ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్లలో తను కూడా ఒకరు కావడం విశేషం… ఈ మధ్యకాలంలో కొన్ని కాంట్రవర్సీల్లో ఆమె పేరు వినిపిస్తున్నప్పటికి తనకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. సీనియర్ హీరోల పక్కన […]

Trisha and Star Hero: ‘వర్షం’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన నటీమణి త్రిష… అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు తమిళ భాషల్లో సినిమాలను చేస్తూ తను టాప్ హీరోయిన్ గా ముందుకు సాగుతుంది. దాదాపు 20 సంవత్సరాలకు పైన ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్లలో తను కూడా ఒకరు కావడం విశేషం… ఈ మధ్యకాలంలో కొన్ని కాంట్రవర్సీల్లో ఆమె పేరు వినిపిస్తున్నప్పటికి తనకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. సీనియర్ హీరోల పక్కన ఆమె బెస్ట్ ఆప్షన్ అంటూ చాలామంది దర్శకులు ఆమెను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. స్టార్ హీరోలందరితో నటించిన ఏకైక హీరోయిన్ కూడా తనే కావడం విశేషం… అయితే కెరీర్ మొదట్లో త్రిష తో సినిమాలు చేసి స్టార్ హీరోగా మారిన వారిలో సిద్ధార్థ ఒకరు.

‘యువ’ సినిమాలో కలిసి నటించిన వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారారు. ఆ తర్వాత ప్రభాస్ చేసిన ‘వర్షం’ సినిమాతో త్రిష హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత సిద్ధార్థ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించారు…

ఈ సినిమా సమయంలో సిద్ధార్థ ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందనే ఈ మూవీ మీద అంచనాలు భారీగా పెరిగాయి… మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ హిట్ అవ్వడంతో సిద్ధార్థ్ సైతం తెలుగులో స్టార్ హీరోగా మారిపోయాడు… ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించకపోవడంతో తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయాడు. తద్వారా అతనితో సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు కూడా ముందుకు రాకపోవడం విశేషం…ఇక మొత్తానికైతే త్రిష అండ తో సిద్దార్థ్ టాప్ హీరోగా మారి భారీ సక్సెస్ లను సాధించాడు…ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి సైతం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper