https://oktelugu.com/

Former MLA Son: యాక్సిడెంట్‌ చేసింది బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకు.. అరెస్ట్‌ అయ్యింది పనిమనిషి.. పోలీసుల సీరియస్‌

షకీల్‌ తన గేమ్‌ మొదలు పెట్టాడు. దుబాయ్‌ నుంచి కథ నడిపించాడు. ప్రజాభవన్‌ వద్ద నుంచి పారిపోయిన సోహేల్‌.. నేరుగ ముంబై చేరుకున్నాడు.

Written By: , Updated On : December 27, 2023 / 04:19 PM IST
Former MLA Son

Former MLA Son

Follow us on

Former MLA Son: హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌ వద్ద బీభత్సం సృష్టించిన కారు కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఆడిన గేమ్‌ బెడిసి కొట్టింది. ఆయన కొడుకు సోహేల్‌ స్వయంగా కారు నడుపుతూ ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టాడు. మద్యం సేవించి మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టాడు. అప్రమత్తమైన పోలీసులు కారులు ఉన్న ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. కానీ, డ్రంకెన్‌డ్రైవ్‌ టెస్ట్‌ చేస్తుండగా ఒక అబ్బాయి పారిపోయినట్లు సీన్‌ క్రియేట్‌ చేశారు. ఆ పారిపోయిన యువకుడు షకీల్‌ కొడుకు సోహేల్‌.

పనిమనిషిని లొంగిపొమ్మని..
ఇక్కడే షకీల్‌ తన గేమ్‌ మొదలు పెట్టాడు. దుబాయ్‌ నుంచి కథ నడిపించాడు. ప్రజాభవన్‌ వద్ద నుంచి పారిపోయిన సోహేల్‌.. నేరుగ ముంబై చేరుకున్నాడు. అక్కడ ఉండగానే… మరుసటి రోజు షకీల్‌ ఇంట్లో పనిచేసే ఒక యువకుడు పోలీసుల వద్దకు వచ్చి.. రాత్రి కారు నడిపింది తానే అని లొంగిపోయాడు. పోలీసులు కూడా మరోమారు ఆలోచన చేయకుండా సదరు యువకుడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

లోతుగా విచారణ..
అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న వెస్ట్‌జోన్‌ డీజీపీ విజయ్‌కుమార్‌ రంగంలోకి దిగారు. లోతుగా విచారణ జరిపించారు. పోలీసుల సహకారంతో షకీల్‌ కొడుకు సోహేల్‌ పారిపోయినట్లు ధ్రువీకరించారు. తర్వాత షకీల్‌ తన ఇంట్లో పని మనిషిని పంపించి లొంగిపోయేలా చేసినట్లు గుర్తించారు. కానీ విచారణలో కారు నడిపింది సోహేలే అని పోలీసులు తేచ్చారు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికే డ్రైవర్‌ ప్రయత్నించినట్లు గుర్తించారు.

దుబాయ్‌ పారిపోయిన సోహేల్‌..
ఇదిలా ఉండగా, ముంబై వెళ్లిన సోహేల్‌.. అక్కడి నుంచి దుబాయ్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. అయితే సోహేల్‌ కోసం గాలిస్తున్నట్లుల పోలీసులు తెలిపారు. ఇందులో షకీల్‌ పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. తండ్రి సహకారంతోనే సోహేల్‌ తప్పించుకున్నట్లు అనుమానిస్తున్నారు.