తెలంగాణలోని వర్సిటీల తలరాతను మార్చింది కేసీఆర్ సర్కార్. ఎన్నో ఏళ్లుగా విశ్వవిద్యాలయాకు పర్మనెంట్ వీసాలు లేక వర్సిటీల చదువులు, విద్యావ్యవస్థ గాడితప్పింది. వర్సిటీలన్నీ సరస్వతీ నిలయాలుగా మారలేకపోయాయి. పరిశోధనలు నత్తనడకన సాగాయి. చదువులు సట్టబండలయ్యాయి. ఎంతో మంది విద్యావేత్తలు దీనిపై గొంతెత్తినా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు.
కానీ ఎట్టకేలకు తెలంగాణ వర్సిటీలకు ఊపిరిపోసింది తెలంగాణ సర్కార్. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి కొత్త వీసీలను నియమించింది.
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం కొత్త వైస్ చాన్స్ లర్ లను నియమించింది. కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా వీసాల నియామక ప్రక్రియ చేపట్టాయి. మంచి ప్రొఫెసర్ల పేర్లను సిఫారసు చేశాయి.
కరోనా కారణంగా ఈ ప్రక్రియకు అడ్డుకట్ట పడింది. ఆలస్యమైనా కూడా కసరత్తు పూర్తి చేసి తాజాగా వీసీలను ఎంపిక చేసి గవర్నర్ కు ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది.
మొత్తం 10 తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. వారు వీరే..
1. ఉస్మానియా యూనివర్సిటీ-డి రవీందర్ యాదవ్
2. కాకతీయ యూనివర్సిటీ -టి. రమేశ్
3.మహాత్మాగాంధీ యూనివర్సిటీ-సి.హెచ్ గోపాల్ రెడ్డి
4. పాలమూరు వర్సిటీ- లక్ష్మీకాంత్ రాథోడ్
5.తెలంగాణ విశ్వవిద్యాలయం -రవీందర్
6. జేఎన్టీయూ -కట్టా నర్సింహారెడ్డి
7.జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్-డి. కవిత
8.శాతవాహన వర్సిటీ-మల్లేశం
9. అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీ-సీతారామరావు
10. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ-టి. కిషన్ రావు