https://oktelugu.com/

ఢిల్లీని తాకిన రైతు ఉద్యమం.. కేంద్రం గుండెల్లో గుబులు..!

కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ బిల్లు అమలు వల్ల రైతులకు పెద్దఎత్తున నష్టాల కలుగుతుందని బిల్లు అడ్డుకునేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూసిన ముజువాణి ఓటుతో కేంద్రం బిల్లును ఆమోదించుకుంది. అనంతరం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన సంగతి అందరికీ తెల్సిందే..! Also Read: పవన్ ఉసరవెల్లి.. ‘జనసేన’ ఎందుకంటూ ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న? కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై తొలి […]

Written By: , Updated On : November 27, 2020 / 05:58 PM IST
Follow us on

farmers protest delhi

కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ బిల్లు అమలు వల్ల రైతులకు పెద్దఎత్తున నష్టాల కలుగుతుందని బిల్లు అడ్డుకునేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూసిన ముజువాణి ఓటుతో కేంద్రం బిల్లును ఆమోదించుకుంది. అనంతరం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన సంగతి అందరికీ తెల్సిందే..!

Also Read: పవన్ ఉసరవెల్లి.. ‘జనసేన’ ఎందుకంటూ ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న?

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై తొలి నుంచి ఉత్తరాది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దక్షిణాది రైతులకు ఈ బిల్లుపై పెద్దగా అవగాహన లేనట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణాది నుంచి కేంద్రంపై పెద్దగా వ్యతిరేకత మాత్రం కనబడటం లేదు. అయితే ఉత్తరాది రైతులు మాత్రం కేంద్రం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కొన్నిరోజులు రైతులు ఉద్యమాలకు బ్రేక్ ఇచ్చారు.

తాజాగా దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో రైతులు మళ్లీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టినట్లు కన్పిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన తమకే నష్టం అని ఉత్తరాది రైతులు భావించారో ఏమోగానీ మరోసారి కేంద్రంపై నేడు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. తొలుత వందల్లో చేరుకున్న రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకునే సమయానికి లక్షల్లోకి చేరుకున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోనే పోలీస్ బలగాలను వారిని అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Also Read:  చీఫ్ జస్టిస్ కు జగన్‌ లేఖపై విచారణ బెంచ్‌ మార్పు.. తీర్పుపై ఉత్కంఠ

ఈక్రమంలోనే పంజాబ్ సీఎం.. హర్యానా సీఎంకు మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పంజాబ్ సీఎం రైతులను రెచ్చగొడుతున్నారంటూ హర్యానా సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి హర్యానా రైతులు సైతం కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ఆయన కేంద్రం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకించడం లేదు. కాగా పంజాబ్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో అక్కడి ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉంటూ కేంద్రంపై పోరాడుతుంది.

ఈక్రమంలోనే హర్యానా సీఎం స్పందిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుతో రైతులకు ఎలా నష్టం జరుగుతుందో చెప్పాలంటూ పంజాబ్ సీఎంకు సవాల్ విసురుతున్నారు. ఈ రెండు ప్రభుత్వాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతున్న తరుణంలో రైతు ఉద్యమం కాస్తా నేతల చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. నేరుగా ఉద్యమం రైతుల చేతుల్లోకి వెళ్లడంతో ఆ ప్రభావం ఢిల్లీ శివార్లలో కన్పిస్తోంది. ఈ ఉద్యమం కాస్తా దేశం మొత్తం పాకితే కేంద్రానికి ఇబ్బందులు కలిగేలా కన్పిస్తున్నాయి. దీంతో రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తోంది. అయితే కేంద్రం చర్చలకు రైతులు ఏమేరకు సహకరిస్తారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్