https://oktelugu.com/

‘ఆచార్య’.. ‘రాధేశ్యామ్’ మరింత ఆలస్యం.. కారణమేంటి? 

టాలీవుడ్లో కొద్దిరోజులుగా షూటింగ్ సందడి మొదలైంది. యంగ్ హీరోలు షూటింగులతో బీజీగా మారగా సీనియర్ హీరోలు మాత్రం కొంచెం ఆలస్యంగా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కరోనా పరిస్థితులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో దర్శక, నిర్మాతలంతా షూటింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. Also Read: ఆ హీరో పెళ్లిళ్లు పై మంచు లక్ష్మి కన్నీళ్లు ! టాలీవుడ్లో కొందరు నటీనటులు కరోనా బారిన పడటంతో షూటింగుల్లో వేగంగా తగ్గింది. ఇంతకముందుగా ఏకదాటిగా షూటింగులు పెట్టడం లేదు. ఓ పది.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 / 06:02 PM IST
    Follow us on

    టాలీవుడ్లో కొద్దిరోజులుగా షూటింగ్ సందడి మొదలైంది. యంగ్ హీరోలు షూటింగులతో బీజీగా మారగా సీనియర్ హీరోలు మాత్రం కొంచెం ఆలస్యంగా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కరోనా పరిస్థితులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో దర్శక, నిర్మాతలంతా షూటింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

    Also Read: ఆ హీరో పెళ్లిళ్లు పై మంచు లక్ష్మి కన్నీళ్లు !

    టాలీవుడ్లో కొందరు నటీనటులు కరోనా బారిన పడటంతో షూటింగుల్లో వేగంగా తగ్గింది. ఇంతకముందుగా ఏకదాటిగా షూటింగులు పెట్టడం లేదు. ఓ పది.. పదిహేను రోజులు షూటింగులు నిర్వహించి మళ్లీ కొంత గ్యాప్ తీసుకొని షూటింగులు చేస్తున్నారు. దీంతో సినిమాలు అనుకున్న సమయానికి విడుదలయ్యేలా అవకాశం లేదని తెలుస్తోంది.

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’.. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలు కూడా మరింత ఆలస్యం అయ్యేలా కన్పిస్తున్నారు. ఈ రెండు చిత్రాలను నిర్మాతలు వేసవిలో విడుదల చేయాలని భావించినప్పటికీ అది కావడం లేదనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలు కూడా దసరాకు విడుదల అవుతాయనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: గాన గంధర్వుడి అభిమానులకు శుభవార్త !

    ‘ఆచార్య’ షూటింగ్ ఇటీవల ప్రారంభమైనప్పటికీ రాంచరణ్ పై తెరకెక్కించే సీన్స్ సంక్రాంతి తర్వాత తీయనున్నారట. సినిమాకు సంబంధించి చాలా షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో సినిమాపై దర్శకుడు కొరటాల పెద్దగా హడావుడి చేయడం లేదని తెలుస్తోంది.

    ఇక రాధేశ్యామ్ షూటింగ్ కోసం చిత్రయూనిట్ మళ్లీ విదేశాలకు వెళ్లాల్సి ఉందట. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు బాగోలేకపోవడంతో ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతి రేసులో ఉన్న వకీల్ సాబ్.. లవ్ స్టోరీ..టక్ జగదీష్.. నారప్ప సినిమాలు వేసవికి రానున్నాయని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్