సీఎం పదవి:నాడు కాలిగోరు..నేడు ప్రజల భిక్ష

తెలంగాణ సీఎం కుర్చీ నా ఎడమకాలి చిటికెన వేలితో సమానమని.. తన పదువుల గురించి ఆలోచించే వ్యక్తి కాదు అని ఇటీవల సీఎం కేసీఆర్ అన్న మాటలు విమర్శలకు తావిచ్చింది. ఒక రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అత్యున్నత పీఠాన్ని కాలివేలుతో పోలుస్తావా? కేసీఆర్ అంటూ చాలా మంది విమర్శించారు. కాలివేలితో పోల్చిన ఆ పదవిని ఎందుకు పట్టుకొని వేలాడుతున్నావని.. దమ్ముంటే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు, జానారెడ్డి లాంటి వారు విమర్శించారు. ఇక జానారెడ్డి ఒక అడుగు […]

Written By: NARESH, Updated On : April 14, 2021 8:49 pm
Follow us on

తెలంగాణ సీఎం కుర్చీ నా ఎడమకాలి చిటికెన వేలితో సమానమని.. తన పదువుల గురించి ఆలోచించే వ్యక్తి కాదు అని ఇటీవల సీఎం కేసీఆర్ అన్న మాటలు విమర్శలకు తావిచ్చింది. ఒక రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అత్యున్నత పీఠాన్ని కాలివేలుతో పోలుస్తావా? కేసీఆర్ అంటూ చాలా మంది విమర్శించారు. కాలివేలితో పోల్చిన ఆ పదవిని ఎందుకు పట్టుకొని వేలాడుతున్నావని.. దమ్ముంటే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు, జానారెడ్డి లాంటి వారు విమర్శించారు.

ఇక జానారెడ్డి ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ కు సీఎం సీటు దక్కింది తనవల్లేనని గొప్పలకు పోయారు. తాజాగా నాగార్జున సాగర్ సభలో మాట్లాడిన కేసీఆర్ దీనికి కౌంటర్ ఇచ్చారు. తనకు సీఎం పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని సీఎం కేసీఆర్ చెప్పారు. తనకు జానారెడ్డి సీఎం పదవిని భిక్షగా పెట్టారని కొందరు చెబుతున్నారని.. సీఎం పదవి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు సక్కగుంటే గులాబీ జెండా ఎందుకు ఎగిరిందని కేసీఆర్ ప్రశ్నించారు.

ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణతితో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విచక్షణతో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. వాస్తవాలు కళ్లముందే ఉన్నాయని.. ప్రజలు ఆగం కాకుండా ఓటేయాలని కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్ కు చేసింది శూన్యమని కేసీఆర్ ఆరోపించారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న జానారెడ్డి హాలియాకు డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు నీళ్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

తన సభ నాగార్జున సాగర్ లో పెట్టకుండా కాంగ్రెస్ నేతలు చాలా ప్రయత్నాలు చేశారని కేసీఆర్ ఆరోపించారు. లియాలో సభకు ఎన్నో అడ్డంకులు సృష్టించాలని చాలా మంది చూశారని ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చని.. తనను ప్రజలతో కలువకుండా చేయాలనుకున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాగర్ లో భగత్ గాలి బాగానే ఉందని కేసీఆర్ జనాలను చూసి వ్యాఖ్యానించారు. భగత్ కు కురిపించే ఓట్లలాగానే నెల్లికల్ లిఫ్ట్ కు నీళ్లు కూడా వస్తాయని ప్రజలకు ఎన్నికల హామీ ఇచ్చారు.