Viral Video : ప్రతిరోజూ రోడ్లపై లక్షలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. వారికి అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా గ్యమాన్ని చేరుకుంటారు. అయితే కొన్ని ప్రదేశాల్లో రోడ్లు బాగా లేకపోతే ప్రభుత్వాలను నిందించుకుంటూ ముందుకు వెళ్తారు. కొందరు మాత్రం ఈ కష్టాలు మనకు తప్పవు అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి రోడ్డు పనులు చేపట్టే సమయంలో సంబంధిత కాంట్రాక్టర్లు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ముందే హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేస్తారు. మరికొన్ని చోట్ల ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు ఎర్రజెండా పట్టుకొని అటువైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ దారిని చూపిస్తుంటారు. కానీ ఓ చోట రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ వీడియో ఏకంగా కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి వద్దకు చేరడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. ఇంతకీ ఈ స్టోరీ ఏంటంటే?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతీ వీడియో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రయాణానికి సంబంధించిన వీడియోల చాలా మంది అప్లోడ్ చేస్తున్నారు. కొందరు తమ జర్నలో ఎదురైన అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే తాజాగా ఎక్స్ లో పోస్ట్ అయిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కారు చాలా స్పీడ్ గా వస్తుంది. వాస్తవానికి ఇది 6 లైన్ రోడ్డు కాబట్టి ఆమాత్రం స్పీడ్ ఉంటుంది. అయితే ఇక్కడ రోడ్డుపై కొన్ని ట్రాఫిక్ కు సంబంధించి బోర్టులు ఏర్పాటు చేశారు. అయితే ఈ బోర్డులపై ఎలాంటి సూచనలు లేవు.
కానీ ఇటువ వైపు వచ్చిన ఓ కారు వీటిని దాటింది. కానీ అమాంతంగా ఒక్కసారి పైకి లేచి కింద పడింది. అదృష్టవ శాత్తూ ఆ కారుకు ఏం కాలేదు. సురక్షితంగానే ముందుకు వెళ్లింది. కానీ ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. నేషనల్ హైవే ఇలా ఉందంటూ చర్చ సాగింది. ఆ తరువాత కొందరు కామెంట్లు చేశారు. చివరికి ఇది కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి వద్దకు చేరింది. దీంతో ఆయన మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసులో సైట్ లోని ఇంజనీర్ ను తొలగించి కాంట్రాక్టర్ కు రూ.50 లక్షలు జరిమానా విధించారు. ఇక ఈ వీడియోలో ఉన్న రోడ్డు ఢిల్లీ, వడోధర మధ్య హైవే అని తేలింది. ఈ రహదారిపై వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తారు. రాజస్థాన్ లోని అల్వార్ , దౌసా మధ్య ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ ఉన్నట్లు అక్కడ ఎలాంటి సూచనలు లేవు. దీంతో కారు పైకి లేచింది. అయితే ఇప్పటకైనా రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇవే కాకుండా దేశంలో చాలా రోడ్డు ఇలాగే ఉన్నాయని కొందరు ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. హైవే రోడ్డుపై వాహనాలు స్పీడ్ తో ఉంటాయి. ఇలాంటప్పుడు రక్షణ చర్యలు లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అని అంటున్నారు.
&
Delhi – Mumbai Expressway update:
The Ministry of Road Transport and Highways has imposed a penalty of ₹50 lakh on the contractor and terminated some officials for road quality issues on the expressway.pic.twitter.com/9DPgS0SNdt
— Mumbai Bhidu (@MumbaiBhidu) September 14, 2024