https://oktelugu.com/

కుక్క చేసిన పనికి పెళ్లి రద్దయింది: ఏం చేసిందంటే.?

కుక్కే కదా అని ఊరికే చీప్ గా చూడకండి.. అదో విశ్వాస జంతువు. యజమాని చెప్పింది చేస్తుంది.. కుక్కకు ఉండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదు. అందుకే వాటికి అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఓ జంటను మాత్రం కుక్కనే విడదీసింది. కుక్క కోసం పెళ్లిని రద్దు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ కుక్క చేసిన ఆ పని ఏంటనేది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇటీవల నిశ్చితార్థం చేసుుకున్న ఓ జంట పెళ్లి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 18, 2021 / 06:07 PM IST
    Follow us on

    కుక్కే కదా అని ఊరికే చీప్ గా చూడకండి.. అదో విశ్వాస జంతువు. యజమాని చెప్పింది చేస్తుంది.. కుక్కకు ఉండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదు. అందుకే వాటికి అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఓ జంటను మాత్రం కుక్కనే విడదీసింది. కుక్క కోసం పెళ్లిని రద్దు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ కుక్క చేసిన ఆ పని ఏంటనేది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

    ఇటీవల నిశ్చితార్థం చేసుుకున్న ఓ జంట పెళ్లి చేసుకునే సమయానికి విడిపోయింది. అందుకు ఓ కుక్కే కారణం కావడం వైరల్ గా మారింది. అమ్మాయికి, అబ్బాయికి మధ్య కుక్క అడ్డం వచ్చి వారిద్దరిని విడగొట్టింది. ఇంతకీ ఆ కుక్క ఏం పని చేసిందో తెలిస్తే నిజంగానే మీరు షాక్ అవుతారు.

    కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జీవించే కరిష్మా వాలియా అనే అమ్మాయికి చిన్పటి నుంచి జంతువులను పెంచుకునే అలవాటు ఉంది. ఆమె ఓ కుక్కను అపూరూపంగా చూసుకుంటోంది. అదంటే ఆమెకు పంచప్రాణాలు. అయితే ఇటీవల ఆమెకు రిస్థిత్ అనే వ్యక్తితో వివాహం ఖాయమైంది. మరో 2 రోజుల్లో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో వీరు సోషల్ మీడియాలో ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వాట్సాప్ లు, చాటింగ్ లు, వీడియోలు చేసుకుంటూ హోరెత్తిస్తున్నారు. వారి ఇష్టాయిష్టాలను ఒకరితో ఒకరు పంచుకునేవారు. ఈ క్రమంలోనే పెళ్లి అయ్యాక తనతోపాటు తన పప్పి కుక్కను తెచ్చుకుంటానని కరిష్మా తెలిపింది. దీనికి రిస్థిత్ మాత్రం పెళ్లయ్యాక మాత్రం అక్కడే వదిలేయ్ అని ఆదేశించాడు. నిన్నయినా వదులుకుంటాను గానీ కుక్కను మాత్రం వదులకోను ఆమె తెగేసి చెప్పింది.

    దీంతో రిస్థిత సీరియస్ గానే మాట్లాడుతున్నావా..? అని అడిగింది. అవునని కరిష్మా చెప్పడంతో రిస్థిత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాటా మాట పెరిగింది.. ఇక నువ్వు కుక్కనే పెళ్లి చేసుకో.. అని రిస్థిత్ సీరియస్ గా చెప్పి కట్ చేశాడు. ఇంట్లో చెప్పుకొని తమకు ఇష్టం లేదని ఇద్దరూ మొండికేయడంతో పెళ్లిని రద్దు చేశారు. వీరిద్దరి మధ్య కుక్క వల్ల పెళ్లి ఆగిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.