https://oktelugu.com/

హుజురాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు.. రేవంత్ వ్యూహమేంటి?

హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేటలో పడింది. ఇప్పటికే కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నా ఆయన ఆడియో వ్యవహారంతో కష్టమే అని చెప్పొచ్చు. కౌశిక్ రెడ్డి క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై తన ఆడియో వ్యవహారంపై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆయనకు టికెట్ అనుమానమే అని తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధువు కావడంతోనే మొదటినుంచి ఆయనకు టికెట్ రావడం కష్టమే అని చెబతున్నారు. ఈ […]

Written By: , Updated On : July 18, 2021 / 06:12 PM IST
Follow us on

TS Congress

హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేటలో పడింది. ఇప్పటికే కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నా ఆయన ఆడియో వ్యవహారంతో కష్టమే అని చెప్పొచ్చు. కౌశిక్ రెడ్డి క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై తన ఆడియో వ్యవహారంపై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆయనకు టికెట్ అనుమానమే అని తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధువు కావడంతోనే మొదటినుంచి ఆయనకు టికెట్ రావడం కష్టమే అని చెబతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి వేటలో పడిపోయింది.

ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని భావించినా అప్పుడు సైతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌశిక్ రెడ్డి కోసమే పెద్దగా ఆసక్తి చూపలేదనే విషయం అందరికి తెలుసు. కానీ ఇప్పుడు కథ మొదటికి వచ్చింది. అటు కౌశిక్ రెడ్డి కాకుండా పోవడంతో ఈటల బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకడం కష్టంగానే మారింది. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యర్థి విషయంలో ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా ఉన్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక పార్టీలో జోష్ పెరిగింది. ఇన్నాళ్లుగా తటస్లులుగా ఉన్న వారు కూడా పార్టీలోకి రావాలని భావిస్తున్నారు. దీంతో ఓటు బ్యాంకు పెరిగి రేవంత్ ఇమేజ్ కూడా రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే కౌశిక్ రెడ్డిని పావుగా వాడుకున్నట్లు సమాచారం. కౌశిక్ రెడ్డిని కోవర్టుగా ఉపయోగించుకుందని పలువరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం వేట మొదలైంది.

కాంగ్రెస్ పార్టీ అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ నాయకుడు పెద్దిరెడ్డిని పోటీలో దింపాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. లేకపోతే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వైపు కూడా మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ గెలుపు గుర్రం కోసం వెతుకుతున్నారు. అభ్యర్థి ఎంపిక బాధ్యత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు అప్పగించారు. అయితే కోవర్టు ఆపరేషన్ తో కాంగ్రెస్ కు డ్యామేజీ అయినట్లు చెబుతున్నారు.