Homeజాతీయ వార్తలుKarnataka Elections BJP: దీ కేరళ స్టోరీ, భజరంగబలి పనిచేయలేదు.. సౌత్ నుంచి బీజేపీ ఔట్..

Karnataka Elections BJP: దీ కేరళ స్టోరీ, భజరంగబలి పనిచేయలేదు.. సౌత్ నుంచి బీజేపీ ఔట్..

Karnataka Elections BJP: ప్రచారంలో “దీ కేరళ స్టోరీ” ని వాడుకున్నారు. “బజరంగబలి” అంటూ ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కానీ ఆ పాచికలు పారలేదు. బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాలు కేరళ స్టోరీని నిషేధించాయి. అయితే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో అక్కడ విడుదల చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ అంశాలు కర్ణాటక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి. అంతేకాదు లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది. అదేవిధంగా బజరంగ్ దళ్ లాంటి సంస్థలు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాటిని నిషేధిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పడం.. ఆ అంశం కూడా కర్ణాటక ఎన్నికల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఈ రెండు అంశాలు తమకు అనుకూలంగా మారుతాయని భారతీయ జనతా పార్టీ భావించింది. కానీ వాస్తవ పరిస్థితిలో ఈ అంశాలు ఎక్కడా కూడా బిజెపికి కలిసి రాలేదు. స్థానిక సమస్యలు, అవినీతి వంటివే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది.

ఇప్పుడు ఏమీ చేయుట?

మొన్నటిదాకా సౌత్ లో కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే బిజెపి అధికారంలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించడంతో బిజెపి సున్నాకు పరిమితమైంది.. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో గెలిచి అదే ఊపును తెలంగాణలో కూడా కొనసాగించాలని బిజెపి నాయకులు తల పోశారు. కానీ వారు అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి.. ప్రధానమంత్రి స్థాయి లాంటి వ్యక్తులు కూడా ప్రచారం చేసినప్పటికీ కర్ణాటకలో బిజెపి ఓటమిని తప్పించలేకపోయారు. అవినీతి, ప్రతి దాంట్లో మితిమీరిపోయిన రాజకీయ జోక్యం భారతీయ జనతా పార్టీ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఓడిపోవడంతో దక్షిణాదిలో బిజెపి పుంజుకోవడం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

డీకే శివకుమార్ కీలక పాత్ర

ఇక కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రధాన కారణం డీకే శివకుమార్ అని చెప్పవచ్చు. కొన్ని కేసుల్లో ఆయన జైలుకు వెళ్లినప్పటికీ కాంగ్రెస్ పార్టీని అతడు వదలలేదు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, బలమైన ప్రతిపక్ష నేతగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను తిరిగి పార్టీ వైపు వచ్చేలా చేశారు. క్యాంపు రాజకీయాల ఉచ్చులో చిక్కుకున్న వారిని సైతం తిరిగి హస్తం గూటికి చేర్చారు. ఉప్పు నిప్పులాగా ఉండే సిద్ధరామయ్యతో కూడా కలిసి పనిచేశారు. అధిష్టానం తనపై పూర్తి నమ్మకంతో ఉండేలా చూసుకున్నారు.. ఇలా ఆయన చేసిన పనులు అన్ని ఇన్ని కావు. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు కూడా పనిచేయని ఫలితాన్ని స్థాయి చూస్తోంది. రాహుల్ గాంధీ నేతలు ప్రచారం చేసి ఉన్నప్పటికీ ఈ విజయం వెనుక ఉన్నది ముమ్మాటికీ శివకుమార్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే వారిలో మొదటి స్థానం ఆయనదే.

ఈ హామీలు గెలిపించాయి

గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్ద కు ప్రతినెల 2000. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో అన్న భాగ్య పథకం ద్వారా నెలకు 10 కిలోల ఉచిత బియ్యం. నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. డిప్లమా చేసి నిరుద్యోగులుగా ఉన్న 18 నుంచి 25 ఏళ్ల యువతకు యువనిధి పథకం ద్వారా నెలకు 1500.. ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.. ఇవి యువతను బాగా ఆకర్షించడంతో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular