Homeఎంటర్టైన్మెంట్F3 Movie Song: 'ఊ ఆ అహ అహ'తో ఊపు తెచ్చిన 'ఎఫ్ 3'

F3 Movie Song: ‘ఊ ఆ అహ అహ’తో ఊపు తెచ్చిన ‘ఎఫ్ 3’

F3 Movie Song:  విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇటీవల ‘ఊ ఆ అహ అహ’ అనే లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

F3 Movie Song
F3 Movie Song

అయితే, తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియో.. సాంగ్ పైనే కాకుండా సినిమా పై కూడా అంచనాలను రెట్టింపు చేసింది. ఏది ఏమైనా దర్శకుడు అనిల్ రావిపూడికి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టాడని తెలుస్తోంది.

Also Read: Best Cars in India: భారత కార్ల పరిశ్రమలో మరుపురాని పది పాపులర్ కార్లు ఇవీ

సహజంగా అనిల్ రావిపూడి సినిమాల్లో మంచి హైలైట్ పాయింట్ ఏమిటంటే.. కామెడీ అంతా హీరోల పాత్రల్లో నుండి మాత్రమే పుట్టుకొచ్చేలా పాత్రలను డిజైన్ చేస్తాడు. ఇక ఎఫ్ 3 సినిమాలో హీరోల పాత్రల విషయానికి వస్తే.. రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. అలాగే, నత్తితో నానాపాట్లు పడే వ్యక్తి పాత్రలో వరుణ్‌ తేజ్ కనిపిస్తున్నాడు.

F3 Movie Song
F3 Movie Song

మొత్తమ్మీద వీరి లోపాలు ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయట. అదే విధంగా ఎఫ్ 2లోని వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుందని కూడా తెలుస్తోంది. ఎలాగూ ఈ సీక్వెల్ లోనూ త‌మ‌న్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టుకెళుతున్న వెంకటేష్, వరుణ్ లను చూపించి.. అనిల్ రావిపూడి కథను చెప్పేశాడు.

ఇక ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాడు. త‌మ‌న్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయట. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో సోనాలి చౌహాన్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, అలాగే అంజలి కూడా నటిస్తున్నారు.

Also Read:Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా కూడా లీక్ అవ్వబోతుందా??.. ఆందోళనలో మేకర్స్

 

Woo Aa Aha Aha Lyrical | F3 Songs | Venkatesh, Varun Tej | Anil Ravipudi | DSP | Dil Raju

Recommended Videos:

Tollywood Pan India Movies that should come before Bahubali ||  Oktelugu Entertainment

Bad News For Nidhi Agarwal || Pawan Kalyan Hari Hara Veera Mallu Update || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version