Jagan: జగన్ సర్కారుకు మిగిలింది రెండు రోజులే.. ఎటూ తేల్చ‌క‌పోతే యుద్ధ‌మే..!

Jagan: ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య తలెత్తిన పీఆర్సీ వివాదం ఇంకా ముదురుతున్నది. పీఆర్సీ అమలు చేసేలా జగన్ సర్కారు జీవోలను జారీ చేయగా, వాటిని మంత్రివర్గం ఆమెదించడంతో పాటు వెనక్కి తగ్గేది లేదని తెలిపింది. దాంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు దశల వారీగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఏపీ సర్కారుపై పోరుకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ కార్యచరణలో […]

Written By: Mallesh, Updated On : January 23, 2022 5:41 pm
Follow us on

Jagan: ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య తలెత్తిన పీఆర్సీ వివాదం ఇంకా ముదురుతున్నది. పీఆర్సీ అమలు చేసేలా జగన్ సర్కారు జీవోలను జారీ చేయగా, వాటిని మంత్రివర్గం ఆమెదించడంతో పాటు వెనక్కి తగ్గేది లేదని తెలిపింది. దాంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు దశల వారీగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఏపీ సర్కారుపై పోరుకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించనున్నారు.

Jagan

ఈ కార్యచరణలో భాగంగా అన్ని శాఖల ఉద్యోగులను కలుపుకుని ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు సాగనున్నారు. ఇప్పటికే సమ్మె నోటీసులు అందజేసిన నాయకులు తర్వాత కార్యచరణను కూడా ప్రకటించేశారు. రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం.. అన్నిజిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా చేయనున్నారు. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం రోజున అనగా ఈ నెల 26న ఏపీ రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించనున్నారు. ఇకపోతే ఆ తర్వాత ఈ నెల 27 నుంచి 30 వరకు వర్క్ టు రూల్‌లోకి వెళ్లనున్నారు. అనంతరం గవర్నమెంట్ యాప్స్ అన్నిటినీ షట్ డౌన్ చేయనున్నారు.

Also Read:  ‘పుష్ప’రాజ్‌గా మారిన‌ సురేశ్ రైనా.. ‘శ్రీవల్లి’ సాంగ్‌కు స్టైలిష్ స్టెప్స్..

వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగనున్నారు. మొత్తంగా ఏపీ సర్కారుపైన దశల వారీగా ఉద్యమం చేయనున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గే ఆలోచనే లేదు అన్న రీతిలో ఉన్నట్లు కనబడుతోంది. కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే వేతనాలు ఇవ్వాలంటూ ఉత్తర్వలు జారీ చేసింది. దాంతో అలానే కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తే కనుక ఉద్యోగులకు తీవ్రమైన నష్టం జరగనుంది. ఈ క్రమంలోనే జీవోలను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

CM YS Jagan

ఇకపోతే ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాసెస్ పూర్తయితే తప్ప జనవరి నెలకు సంబంధించిన వేతనాలు అందవు. ఇందుకుగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండ్రోజుల కిందట ఇచ్చిన ఉత్తర్వులను ట్రెజరీ ఉద్యోగులు పట్టించుకోలేదు. దీంతో తాజాగా మరోసారి ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీనిపైన కూడా పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఇప్పట్లో పూర్తి కాదనే అభిప్రాయం కూడా పలువురి నుంచి వ్యక్తమవుతున్నది. చూడాలి మరి..భవిష్యత్తులోనైనా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం మెట్టు దిగుతుందో లేదో.. .

Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ మూవీ అప్ డేట్స్ !

Tags