Junior NTR: చాలా చిన్న ఏజ్‌లోనే మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్. టాలీవుడ్ యంగ్ టైగర్ గా దూసుకుపోతున్నాడు. నందమూరి హీరోల్లో అత్యధిక ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరో కూడా జూనియర్ ఎన్టీఆరే. అయితే ఇప్పటికే ఆయన 29 సినిమాలు చేశాడు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో తొలిసారిగా ప్యాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్‌లో చేస్తున్నాడు. ఈ మూవీపై ఉన్న అంచనాల గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది.
అయితే ఈ సినిమా తర్వాత తన 30వ సినిమాను చేయబోతున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో ఈ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉండబబోతోందని సమాచారం. తొలిసారి ఇలాంటి మూవీలో నటిస్తున్నాడు యంగ్ టైగర్. ఇక ఆర్ ఆర్ ఆర్ కూడా మార్చిలోనో లేదంటే ఏప్రిల్‌లోనో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ మార్కెట్ ప్రకారం.. ఒక్కో సినిమాకి రూ.20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అయితే ఎన్టీఆర్ ఆస్తులకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ ప్రత్యేకమే.
Also Read: జగన్ సర్కారుకు మిగిలింది రెండు రోజులే.. ఎటూ తేల్చకపోతే యుద్ధమే..!
అయితే అసలు ఎన్టీఆర్‌కు ఏమేం ఆస్తులున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్‌కు హైదరాబాద్ లో ప్రస్తుతం దాదాపు రూ.50 కోట్ల ఇల్లు ఉంది. ఎన్టీఆర్ అందులోనే ఉంటున్నాడు. ఇక అతనికి పోర్స్చ్ 911 కారు ఉంది. దీని ధర కోటిన్నరకు పైమాటే. ఇక రూ.2.5కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు కూడా ఉంది. ఎన్టీఆర్ ఎక్కువగా రేంజ్ రోవర్ కారులోనే ప్రయాణిస్తూ ఉంటాడు. ఇక వీటితో పాటు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్‌లు కూడా ఎన్టీఆర్‌కు ఉన్నాయి.
ఇందులో ఒకటి రూ.2 కోట్ల 20 లక్షలు ఖరీదు ఉంటుంది. ఇక రీసెంట్ గానే బెంజ్ 4 మెటిక్ కారు కొన్నాడు. దీని విలువ దాదాపు కోటి ఇరవై లక్షలు ఉంటుందంట. ఇక మరో వాచ్ ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఆంపైర్ కూడా ఉంది. దీని రేటు రూ.19 లక్షలు. బివిఎల్ గరి బై రిట్రో స్టీల్ సెర్మైక్ అనే రూ.7 లక్షల 12 వేల విలువ చేసే వాచ్ కూడా ఉంది. ఇక చివరగా పనెరై లుమినర్ సబ్ మెర్స బుల్ అనే రూ.5 లక్షల వాచ్ ఉంది. ఇవి కేవలం అతను వాడుతున్న వస్తువుల విలువ మాత్రమే. ఇవి కాక ఇతర వ్యాపార రంగాల్లో కూడా అనేక ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడంట తారక్.
సినిమాలతో పాటు కొన్ని యాడ్స్ లో కూడా చేస్తున్నాడు తారక్. వీటికి కూడా దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల దాకా తీసుకుంటున్నాడంట. ఇక ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా పెద్ద వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చింది. ఇక ఆర్ ఆర్ ఆర్ పెద్ద హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ మార్కెట్ పెరిగి రెమ్యునరేషన్ భారీగా పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఆ లెక్కన అతని సంపాదన డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది.
Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ మూవీ అప్ డేట్స్ !