https://oktelugu.com/

Suresh Raina: ‘పుష్ప’రాజ్‌గా మారిన‌ సురేశ్ రైనా.. ‘శ్రీవల్లి’ సాంగ్‌కు స్టైలిష్ స్టెప్స్..

Suresh Raina: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప : పార్ట్ వన్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నార్త్ ఇండియాలో ఈ ఫిల్మ్ జనాలకు విపరీతంగా నచ్చేస్తోంది. ఈ క్రమంలోనే ‘పుష్ప’ మేనియా కొనసా..గుతోంది. ఈ చిత్రంలోని బన్నీని అనుకరిస్తూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరలవుతున్నాయి. ఇటీవల ఈ సినిమా చూసి అనేక మంది క్రికెటర్స్ కూడా ఫిదా అయిపోయారు. తాజాగా ఈ పిక్చర్ చూసి టీమిండియా మాజీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 23, 2022 / 05:35 PM IST
    Follow us on

    Suresh Raina: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప : పార్ట్ వన్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నార్త్ ఇండియాలో ఈ ఫిల్మ్ జనాలకు విపరీతంగా నచ్చేస్తోంది. ఈ క్రమంలోనే ‘పుష్ప’ మేనియా కొనసా..గుతోంది. ఈ చిత్రంలోని బన్నీని అనుకరిస్తూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరలవుతున్నాయి. ఇటీవల ఈ సినిమా చూసి అనేక మంది క్రికెటర్స్ కూడా ఫిదా అయిపోయారు. తాజాగా ఈ పిక్చర్ చూసి టీమిండియా మాజీ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ సీనియ‌ర్ బ్యాట‌ర్ సురేష్ రైనా బాగా ఇంప్రెస్ అయిపోయాడు.

    Suresh Raina

    ‘పుష్ప’ చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాటకు డ్యాన్స్ చేశాడు. అది కూడా అచ్చం అల్లు అర్జున్ లాగా మారిపోయి.. చెప్పులు, కళ్ల జోడు ధరించి స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. వీడియో చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ పాట నెట్టింట బాగా సందడి చేస్తోంది. ఇటీవల ఈ పాటకు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్నాడు. టీమిండియా యువ క్రికెట‌ర్లు సూర్య‌కుమార్ యాద‌వ్, ఇషాన్ కిష‌న్ కూడా చిందేశారు. ఇక ‘పుష్ప’ డైలాగ్‌ను డేవిడ్ వార్న‌ర్, ర‌వీంద్ర జ‌డేజా చెప్పి ఆక‌ట్టుకున్నారు.

    సురేశ్ రైనాతో పాటు ఆయన పక్కన మరో ఇద్దరు ‘శ్రీవల్లి ’ పాటకు స్టెప్పులు వేయగా, అవి చూసి నెటజన్లు సంబురపడిపోతున్నారు. మొత్తంగా బన్నీ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఆనంద పడిపోతున్నారు. చాలా మంది ‘పుష్ప’ సినిమా చూసి బన్నీ మాదిరిగా జబ్బలను అలాపైకెత్తి ఉంచడంతో పాటు గడ్డం పెంచుకుని రకరకాల స్టెప్పులేస్తున్నారు.

    Suresh Raina

    సినిమా డైలాగ్‌లు చెప్తూ, పాటలకు తగ్గట్లు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. ఇకపోతే సురేశ్ రైనా ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొననున్నాడు. రైనా ఇప్ప‌టివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడాడు. కానీ, ఈ సారి చెన్నై రిటెన్ష‌న్ జాబితాలో రైనాకు చోటు ద‌క్క‌లేదు. కాగా, ఈ సారి వేలంలో మళ్లీ సీఎస్కేనే రైనాను దక్కించుకునే అవకాశం ఉంది. చూడాలి మరి.. ఏమవుతుందో..

    Tags