Rain Alert: అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా చెన్నైలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర మంతటా మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలిపింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబర్ 12న పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఐఎండీ సూచన ప్రకారం.. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, పుదుక్కోట్టై, రామనాథపురం, విల్లుపురం జిల్లాలు, పుదుచ్చేరి మరియు కరైకల్ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత నెలలోనూ భారీ వర్షాలు కురవడంతో అక్టోబర్ 17న తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తాజాగా గత అనుభవాల దృష్ట్యా ఈసారి వర్షాలు కురవక ముందే సెలవు ప్రకటించింది.
చెన్నై వాతావరణం ఇలా..
ఇక చెన్నైలో మంగళవారం(నవంబర్ 12న) మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గాలిలో తేమ 81 శాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 27.47 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 25.14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని వెల్లడించింది.
బుధవారం : గరిష్ట ఉష్ణోగ్రత 26.94 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 24.94 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
గురువారం : గరిష్ట ఉష్ణోగ్రత 29.29 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 25.95 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
శుక్రవారం : గరిష్ట ఉష్ణోగ్రత 28.96 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 25.3 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
శనివారం : గరిష్ట ఉష్ణోగ్రత 29.17 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.06 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చు. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఆదివారం : గరిష్ట ఉష్ణోగ్రత 28.95 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 25.98 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమవుతుంది.