Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ కి రావడం లేదని భారత్ పై పాక్ విషం.. ఏకంగా ఐఓసీ కి లేఖ! అది మనకు ఏ రకంగా నష్టమంటే..

8 సంవత్సరాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. 2017 తర్వాత వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ముందడుగు వేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 12, 2024 10:52 am

ICC Champions Trophy 2025

Follow us on

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాకిస్తాన్ అనేక మైదానాలను సిద్ధం చేస్తోంది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ వాటి ఆధునికీకరణకు భారీగానే డబ్బు వెచ్చిస్తోంది. అయితే ఈ ట్రోఫీలో భారత్ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఐసీసీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు లేఖ రాసింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఐసీసీ తెలిపింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక్కసారిగా షాక్ లో కూరుకుపోయింది. భారత వ్యవహార శైలి పట్ల పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు . ” బీసీసీఐ చెప్పినట్టు ఐసిసి చేస్తోంది. విచక్షణ అధికారం మర్చిపోయి బీసీసీఐ చెప్పినట్టు తోక ఊపుతుంది. ఇలాంటి పరిణామాలు మంచిది కావు. క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. అలాంటి ఆటను ఇలా నవ్వులపాలు చేయడం సరికాదు. టీమిండియా పాకిస్తాన్ వస్తే మా ఆతిథ్యాన్ని చూపిస్తాం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. వారిని మేము మా గుండెల్లో పెట్టుకుంటాం. వారికోసం మేము అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామని” పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు..

విషం కక్కడం మొదలుపెట్టింది

ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేందుకు రాబోమని బీసీసీఐ తేల్చి చెప్పిన నేపథ్యంలో.. పాకిస్తాన్ భారత్ పై విషం కక్కడం మొదలుపెట్టింది. 2036 లో ఒలింపిక్స్ నిర్వహించాలని భారత్ భావిస్తోంది. అయితే ఆ ఆతిథ్యం భారతదేశానికి రాకుండా చూడాలని పాకిస్తాన్ ఇప్పటినుంచే తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. చాంపియన్స్ ట్రోఫీ లో ఆడేందుకు భారత్ రాకపోవడంతో.. ఆ దేశం దాఖలు చేసే ఒలంపిక్ బిడ్ ను వ్యతిరేకించాలని పాకిస్తాన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల భారతదేశం తన ఆసక్తి వ్యక్తీకరణ లేఖను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అందజేసింది. 2036లో తాము ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఇటీవల భారత్ ప్రకటించింది. అయితే భారత్ కు ఆ బిడ్ దక్కకుండా ఉండడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. ఒలింపిక్ బిడ్ దక్కకుండా.. భారతదేశానికి వ్యతిరేకంగా వివిధ వేదికల పై ప్రచారం చేయాలని పాకిస్తాన్ జట్టు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ” క్రికెట్ పోటీలను భారత్ ఏకపక్షంగా మార్చింది. అందులో విపరీతమైన రాజకీయాలు చేస్తోంది. ఇలాంటి పరిణామాలు మంచివి కాదు. ఛాంపియన్ ట్రోఫీ మా దేశం వేదికగా నిర్వహిస్తుంటే భారత్ పట్టించుకోవడం లేదు. తమ జట్టును మా దేశానికి పంపించడం లేదు. ఇలా అయితే క్రీడా స్ఫూర్తి ఎలా ఉంటుంది? దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు క్రీడల ద్వారానే వెల్లి విరుస్తాయి. ఈ విషయం బీసీసీఐకి తెలియకపోవడం దారుణమని.. ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించాలని” పాకిస్తాన్ క్రీడా శాఖ అధికారులు సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యానిస్తున్నారు.