https://oktelugu.com/

South Sudan: మురికీ నీరు తాగాలి.. లేదా చనిపోవాలి!? దక్షిణ సూడాన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే?

దక్షిణ సూడాన్‌ స్వాతంత్య్రం పొందిన ఎనిమిదేళ్లకే తీవ్ర ఆర్థిక సంక్షోభం, కరువు ఎదుర్కొంటోంది. భారీ వర్షాలతో అక్కడ తాగునీరు కూడా దొరకడం లేదు. ప్రమాదమని తెలిసినా మురికినీరు తాగుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 12, 2024 / 10:44 AM IST

    South Sudan

    Follow us on

    South Sudan: ప్రపంచంలో అతి చిన్న, పేద దేశాల్లో దక్షిణ సూడాన్‌ ఒకటి. చమురు ద్వారా వచ్చే ఆదాయంపైనే ఈ దేశం ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే ఆచమురే అక్కడి ప్రజలపాలిట కిల్లర్‌గా మారుతోంది. దక్షిణ సూడన్‌ గడ్డి మైదానాల్లో ఒక చిన్న చెరువు నుంచి స్థానికులు మురికి నీరు తెచ్చుకుంటున్నారు. అవే వారికి తాగునీరు. ఆ నీరు తాగితే చనిపోతామని వారికి తెలుసు. అయినా వాటినే తాగుతున్నారు. ఎందుకంటే.. ఆ చెరువు చమురు ఉండే ప్రాంతంలో ఉంది. ఇక ఇక్కడి నీరు తాగితే దగ్గు, ఆయాసం వస్తాయని అక్కడి ఓ పశువుల కాపరి తెలిపారు. తమకు ఈ నీళ్లే దిక్కని, ఇవి కాకపోతే ఎక్కడా నీరు దొరకవని, ఈ నీళ్లు తాగకపోయినా చచ్చిపోతామని పేర్కొంది. ఈ ప్రాంతంలో వస్తున్న వరదలతో నీటి వనరులు కలుషితమవుతున్నాయని ఆయిల్‌ కంపెనీ మాజీ ఇంజినీర్‌ డేవిడ్‌ బోజో లెజూ తెలిపారు. ఊహించని వరదల కారణంగా చాలా ప్రాంతాలు ఏళ్లపాటు నీళ్లలోనే ఉండిపోయాయి. దీనికితోడు వాతావరణ మార్పులు పరిస్థితిని మరింత దిగజార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక చమురు నిల్వల నిర్వహణ సరిగా లేక మురికినీరు దేశమంతా సైలెంట్‌ కిల్లర్‌లా మారిందని పేర్కొంటున్నారు.

    2019 నుంచి వరదలు..
    దక్షిణ సూడాన్‌లో చమురు ఉత్పత్తి రాష్ట్రమైన యూనిటీ స్టేట్‌ను కొన్నేళ్లుగా వరదలు ముంచెత్తుతున్నాయి. 2019లో అతి తీవ్రమైన వర్షాలు ప్రళయం సృష్టించాయి. ఆ తర్వాత సంవత్సరం నుంచి ఏటా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నీళ్లు నేల పొరల్లో నిలిచిపోయాయి. 2022లో అత్యంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. యూనిటీ స్టేట్‌లో మూడింట రెండో వంతు మునిగిపోయింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం వెల్లడించింది. అందులో 40 శౠతం ఇప్పటికీ నీళ్లలోనే ఉంది. గ్రేటర్‌ పయోనీర్‌ ఆపరేటింగ్‌ కంపెనీ అనే ఆయిల్‌ కన్సార్టియంలో బోజోలెజు ఎనిమిదేళ్లు పనిచేశారు. ఈ కంపెనీ ఇండియా, చైనా, మలేషియా జాయింట్‌ వెంచర్‌. దక్షిణ సూడాన్‌ ప్రభుత్వానికి ఇందులో 5 శాతం వాటా మాత్రమే ఉంది. ఐదేళ్ల క్రితం పగిలిపోయిన పైపులైన్‌తో చమురు చెరువుల్లో కలిసింది. చమురు బావులు, పైపులైన్ల నుంచి లీకేజీలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. కలుషితమైన మట్టిని రోడ్ల నుంచి తరలించడంలోనూ తాను పాల్గొన్నానని బోజో తెలిపారు. అయితే సరైన ప్రణాళిక లేక నీరు కలుషితమైందని వెల్లడించారు.

    లక్షకు పైగా పశువులు మృతి
    ప్రొడూసర్‌ వాటర్‌.. అంటే చమురు వెలికితీస్తున్నప్పుడు భూమి నుంచి వచ్చే నీటిలో హైడ్రోకార్బన్లు, ఇతర కాలుష్య పదార్థాలు ఉంటాయి. వీటిని తాగడం వలన లక్షకుపైగా పశువులు మృతిచెందాయి. నీటిని శుద్ధి చేయకుండానే చెరువుల్లోకి వదులుతున్నారు. నదులలోకి కూడా ఈ నీరు ఏరుతుందని వెల్లడించారు. బోరు బావుల్లోకి కూడా ఈ నీరు చేరుతుంది. చమురులోని రసాయనాలు భూగర్భంలోకి వెళ్తున్నాయి. ఇక వర్షాలు వరదల కారణంగా కలుషిత నీరు అంతటికీ విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఇక ఈ నీరు తాగిన పశువులకు తలలు, అవయవాలు లేకుండా దూడలు పుడుతున్నాయని స్థానికులు తెలిపారు.

    వ్యాధులఞారినపజలు..
    ఇక కలుషిత నీటిని మరిగించి తాగుతున్నారు. అయినా రసాయనాల కారణంగా ఈ నీటిని తాగిన ప్రజలు డయేరియా, పొత్తికడుపు నొప్పి వంటివి వస్తున్నాయి. మరోవైపు వరదల కారణంగా 1,40,000 మంది సహాయ శిబిరాల్లోనే ఉంటున్నారు. అక్కడి మట్టిదిబ్బలే వారిని కాపాడుతున్నాయి. అక్కడి ప్రజలు కలువ వేర్లు, చేపల వేటపై ఆధారపడుతున్నారు. సురక్షితమైన నీరు మాత్రం దొరకడం లేదు.

    పిల్లల్లో వైకల్యం..
    ఇక చమురు కాలుష్యం కారణంగా పిల్లల్లో వైకల్యం సభవిస్తోందని డాక్టర్లు తెలిపారు. అవయవ లోపాలతో పిల్లలు పుడుతున్నారు. బెంటియులోని ఓ ఆస్పత్రిలో ఒక మహిళకు పుఇ్టన బిడ కన్ను, ముక్కు కలిసిపోయి పుట్టాడు. కలుషిత నీరు కారణంగానే ఇలా పుట్టాడని డాక్టర్‌ శామ్యూల్‌ తెలిపారు. కొందరికి అవయవాలు లేకపోవడం, తల చిన్నగా ఉండడం వంటి లోపాలతో పుడుతున్నారు. బెంటియు, రువెంగ్‌లో చాలా మంది ఇలాగే ఉన్నారు. జన్యుపరమైన లోపాలు, తల్లి వయసు, పోషకాహార లోపం, ఇతర ఇన్‌ఫెక్షన్ల కారణంగా కూడా ఇలా అసాధారణంగా జన్మిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

    2011లో స్వాతంత్య్రం..
    ఇదిలా ఉంటే దక్షిణ సూడాన్‌ 2011లో సూడాన్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది. అయితే మూఢనమ్మకాలను ఇతర చెడు సంప్రదాయాలను సూడాన్‌ నుంచి దక్షిణ సూడాన్‌ వారసత్వంగా పొందింది. ఐదేళ్ల అంతర్యుద్ధానికి 2013లో తెరపడింది. సంక్షోభం కారణంగా చమురు నిల్వలపై ఎక్కువగా ఆధారపడుతోంది.